రోగ్య శాఖలో | - | Sakshi
Sakshi News home page

రోగ్య శాఖలో

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

రు పోస్టుల కథ

● ఎస్టీలకు దక్కాల్సిన పదోన్నతులపై నీలినీడలు

● కావాల్సిన వారికి పదోన్నతులు

ఇస్తున్నారంటూ ఆరోపణలు

● జిల్లా వైద్యారోగ్యశాఖ సచివాలయ

ఏఎన్‌ఎంల పదోన్నతుల్లో గందరగోళం

మళ్లీ కోర్టును ఆశ్ర యిస్తున్నాం

గ్రేడ్‌–2 ఏఎన్‌ఎం పదోన్నతుల వ్యవహారంలో ఎస్టీలకు అన్యాయం జరిగింది. ఇదేంటని అడిగితే రోస్టర్‌ రిజిస్టర్‌ పోయిందని పోలీస్‌ కంప్‌లైంట్‌ ఇచ్చామంటున్నారు. ఆ రిజిస్టర్‌ లేకుండా వీళ్లు ఎలా ఇంతమందికి పదోన్నతులు ఇస్తున్నారో ఉన్నతాధికారులు గమనించాలి. ఎలాగైనా అక్రమంగా పదోన్నతులను ఇచ్చేయాలని కొందరు అధికారులు జేబులు నింపుకున్నారు. జాతీయ ఎస్టీ కమిషన్‌ ఆదేశాలను సైతం పట్టించుకోకుండా పదోన్నతులు పూర్తి చేస్తున్నారు. మాకు రావాల్సిన 9 పదోన్నతుల్లో ఇంకా ఆరు పదోన్నతులు ఇవాల్సి ఉంది. దీనిపై మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం.

– వాబ యోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

అరసవల్లి:

హెల్త్‌ సెక్రటరీల పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయడానికి వైద్యారోగ్య శాఖాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయాల్లో 656 మంది వరకు గ్రేడ్‌–3 హెల్త్‌ సెక్రటరీలను నియమించారు. ఈ గ్రేడ్‌–3 సెక్రటరీలను గ్రేడ్‌–2 ఏఎన్‌ఎంలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది.

జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం వేదికగా అక్రమ వసూళ్లు, సిఫారసుల పుణ్యమా అని ఇంకా మొదటి విడత పదోన్నతుల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. తాజాగా మరోసారి ఈ పదోన్నతుల ప్రక్రియ ఫైల్‌ కలెక్టరేట్‌కు చేరుకుని మంగళవారం కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించారు. అయితే ఈ పదోన్నతుల ప్రక్రియలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రక్రియను పాటించకపోవడంతో న్యాయంగా తమకు దక్కాల్సిన తొమ్మిది పదోన్నతులు తమ వారికి దక్కడం లేదంటూ ఎస్టీ సామాజిక సంఘ ప్రతినిధులు గళమెత్తారు. ఇదే విషయంలో ఆదివాసీల సంఘం ఆధ్వర్యంలో గత ఏడాదిలో కూడా నిరసన వ్యక్తం చేయడంతో అప్పట్లో మూడు పోస్టులను ఎస్టీలకు కేటాయించారు. అయితే మిగిలిన ఆరు పోస్టుల విషయం మాత్రం వివాదాస్పదంగా మారింది. దీంతో ఈ పదోన్నతుల అంశం న్యాయస్థానాలకు వెళ్లడంతో పెండింగ్‌లో పడింది.

జాతీయ ఎస్టీ కమిషన్‌ ఆదేశాలు సైతం బేఖాతరు

రాష్ట్రంలో దాదాపుగా అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ ఏఎన్‌ఎం పదోన్నతుల తొలివిడత ప్రక్రియ పూర్తయిపోయి రెండో విడత కూడా సిద్ధం అవుతుండగా.. జిల్లాలో మాత్రం ఇంకా తొలివిడతే పూర్తి కాలేదు. దీంతో మొత్తం తొలివిడతలో 154 ఏఎన్‌ఎం (గ్రేడ్‌–2) పదోన్నతుల్లో 148 వరకు ర్యాంకింగ్‌ ఇచ్చి మిగిలిన ఆరు పోస్టులను ఎస్టీలకు కేటాయించకుండా రహస్య అజెండాగా ఉంచేశారు. ఎలాగోలా పదోన్నతులు పూర్తి చేయాలనే లక్ష్యంతో వాట్సాప్‌ల్లో కూడా ఆర్డర్లు ఇచ్చేసి...ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మంగళవారం నాడు కూడా మళ్లీ ఆ ఆరు పోస్టుల వ్యవహారం తెరమీదకు వచ్చింది. అప్పట్లో ఈ అంశంపై జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించిన ఎస్టీ బాధితులకు స్పష్టమైన అనుకూల ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మొత్తం 154 పోస్టుల్లో ఆర్‌ఓఆర్‌ ప్రకారం 9 పోస్టులను ఇవ్వాలంటూ జాతీయ ఎస్టీ కమిషన్‌ ఆదేశించింది. కానీ మూడు పోస్టుల్లో మాత్రమే ప్రమోషన్లు ఇచ్చి.. మిగిలిన ఆరు పోస్టుల్లో మిగిలిన కులాల వారికి పలు సిఫారసులతో పదోన్నతులు కల్పించాలని అధికారులు పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. జాతీయ ఎస్టీ కమిషన్‌ ఆదేశాల అమలు జరగాలని ఎస్టీ కుల సంఘ ప్రతినిధులు, బాధితులు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ను, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అనితను కలిసి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఆ ఆరు పోస్టుల వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో జిల్లా ఎస్టీ సామాజిక వర్గ ప్రతినిధులు నిరసన చర్యలకు సిద్ధమవుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement