బస్‌తీ మే సవాల్‌ | - | Sakshi
Sakshi News home page

బస్‌తీ మే సవాల్‌

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఇద్దరు బస్‌డ్రైవర్ల వాగ్వాదం

గతంలో ఇదే స్థలంలో పలు ప్రమాదాలు

అయినా మారని సారథుల తీరు

శ్రీకాకుళం క్రైమ్‌ : మంగళవారం ఉదయం 10.15 గంటలు.. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సు.. డేఅండ్‌నైట్‌ వైపు నుంచి ఎస్పీ కార్యాలయం మీదు గా కాంప్లెక్సుకు ఓ ఆర్టీసీ బస్సు రయ్‌మంటూ దూసుకునివచ్చింది. అదే సమయంలో ఆర్టీసీ కాంప్లెక్సు లోపలినుంచి ఔట్‌ గేట్‌ వైపు వస్తున్న మరో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు బస్సు ఆదరాబాదరాగా వచ్చింది. దాదాపు రెండు బస్సులు గుద్దుకునేంత పనిచేశాయి. అంతే ఇద్దరి డ్రైవర్ల ఇగోలు బద్దలైపోయా యి. ఒకరితో ఒకరు రోడ్డుపైనే వాగ్వాదానికి దిగా రు. నువ్వు ముందు తీయ్‌.. అంటే నువ్వే ముందు తీయ్‌ అంటూ వాదనకు దిగారు. అప్పటికే అంబేడ్కర్‌ కూడలి వరకు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సమీపంలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు నిలువరించినా ఇరువురూ ఏ మాత్రం తగ్గలేదు. కాసేపటికి అటుగా పోయే వాహనదారులు, ట్రాఫిక్‌ పోలీసులు సైతం ఇరువురికీ క్లాస్‌ పీకడంతో కాంప్లెక్స్‌ నుంచి వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ వెనక్కి తీయడంతో కథ సుఖాంతమైంది.

అసలే డేంజర్‌ జోన్‌

జిల్లా కేంద్రంలోని డేఅండ్‌నైట్‌ పరిసర ప్రాంతాలన్నీ ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం డేంజర్‌ జోన్‌ కిందకే వస్తాయి. ఆర్టీసీ కాంప్లెక్సు ఎదురుగా జిల్లాకోర్టు ఉండటం, సమీపంలోనే ఎమ్మార్వో, ఎస్పీ, ట్రెజరీ కార్యాలయాలుండటంతో నిరంతరం ఆ ప్రాంతమంతా రద్దీగానే ఉంటుంది. ఇదే ప్రాంతంలో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అలాంటి చోట్ల డ్రైవర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఇలా వాదులాడుకోవడం తగదని స్థానికులు సూచిస్తున్నారు.

● ఈ ఏడాది ఏప్రిల్‌ 4న జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సులో తాను వచ్చి దిగిన ఆమదాలవలస బస్సే నడుస్తుండగా ఢీకొనడంతో లావేరు మండలం వెంకటాపురం చెందిన అంధవరపు జయలక్ష్మి మృతిచెందారు.

● ఈ ఏడాది జనవరి 11న జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సు ఇన్‌గేట్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని పైల నరసమ్మకు తీవ్రగాయాలయ్యాయి.

● గత ఏడాది సెప్టెంబర్‌లో టెక్కలి నుంచి విశాఖ వెళ్తున్న బస్సు ఆర్టీసీ కాంప్లెక్సు లోపలికి వెళ్తున్న రాజాం మండలానికి చెందిన గురు వూరు శంకరరావును ఢీకొట్టింది. దీంతో రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యి విశాఖలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

● గత ఏడాది మార్చి 3న డేఅండ్‌నైట్‌ నుంచి తన భర్త స్కూటీపై వెళ్తున్న గర్భిణిని నాగావళి కొత్త వంతెనపై ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో మృత్యువాత పడింది.

● గత ఏడాది అక్టోబరులో వృద్ధుడైన బిల్డర్‌ అంబేడ్కర్‌ కూడలి మలుపు వద్దకొచ్చేసరికి అతివేగంతో వస్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement