ఉత్తమ విద్యాలయాలకు జాతీయ ‘స్వచ్ఛ ఏవం’ పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ విద్యాలయాలకు జాతీయ ‘స్వచ్ఛ ఏవం’ పురస్కారాలు

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

హిరమండలం, జలుమూరు: జాతీయ స్థాయిలో ఏవమ్‌ హరిత విద్యాలయంగా హిరమండలం కేజీబీవీ ఎంపికై ంది. ఏపీలో 8 పాఠశాలలు ఎంపిక కాగా.. అందులో హిరమండలం కేజీబీవీ ఒకటి కావడం విశేషం. పాఠశాలలో ఉత్తమ విద్యాబోధనతో పాటు పరిశుభ్రత, పచ్చదనానికి పెద్దపీట వేసినందుకుగాను పురస్కారానికి ఎంపిక చేశారు. పురస్కారం ఎంతో బాధ్యత పెంచిందని కేజీబీవీ ప్రత్యేక అధికారిణి కృష్ణవేణి తెలిపారు.

జలుమూరులో..

జాతీయ స్థాయిలో ఉత్తమ పాఠశాలగా జలు మూరు ప్రాథమిక ఆదర్శ పాఠశాల ఎంపికై ంది. దీన్ని సమగ్ర శిక్ష రాష్ట్ర డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ధ్రువీకరించినట్లు హెచ్‌ఎం ఇప్పిలి మాధవరావు మంగళవా రం తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రత, పర్యావర ణం పరిరక్షణ, విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని అందించడం, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశా లు పరిగణలోకి తీసుకుంటారు. జలుమూరు ఆద ర్శ ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ఉపాధ్యాయులు మెండ రామారావు పాఠశాల రూపురేఖలను మార్చారు. విద్యార్థుల హాజరు పెంచడంలో హెచ్‌ఎం మాధావరావు, తోటి ఉపాధ్యాయులు రామారావు కీలక పాత్ర పోషించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement