శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో సచివాలయ ఏఎన్‌ఎం ఉద్యోగుల పదో న్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించకుండా అడ్డగోలుగా పదోన్నతుల జాబితాలు సిద్ధం చేశారని దళిత సంఘాల జేఏసీ నాయకులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కి మంగళవారం ఫిర్యా దు చేశారు. దళిత సంఘాల జేఏసీ అధ్యక్షుడు కంఠ వేణు, ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను, రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు రాయి వేణుగోపాల్ మాట్లాడుతూ పదోన్నతుల్లో ఎస్సీ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతి రిజర్వేషన్లు కేటాయింపులో అనుమానాలు ఉన్నాయన్నారు.
జాతీయ ఎస్టీ కమిషన్ జారీ చేసిన ఆదేశాలను సంబంధిత అధికారులు తక్షణమే అమలు చేయాలని వారు కోరారు. రోస్టర్ వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు.


