హిరమండలం: వంశధార కుడి ప్రధాన కాలువ వద్ద నుంచి విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమా దం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో ఉంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయం చెంతనే వంశధార కుడి ప్రధాన కాలువ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ కాలువ మీదుగా 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ వెళుతోంది. అయితే వైర్లు వేలాడడంతో పాటు గాలికి రాపిడికి గురై నిప్పులు ఎగసిపడుతున్నాయి. చేతికి అందేంత ఎత్తులోనే తీగలు ఉన్నాయి. వంశధార కాలువ పొడవునా రేవులు ఉన్నాయి. స్థానికులు స్నానాలతో పాటు ఇతర అవసరాలకు అటువైపుగా వెళుతుంటారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనతో ఉన్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించింది వైర్లను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలం దృష్ట్యా త్వరగా మరమ్మతు పనులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతదేహం గుర్తింపు
పొందూరు: మండలంలోని పెనుబర్తి, బొడ్డేపల్లి గ్రామాల మధ్య రైల్వే పట్టాలపై మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో మృతదే హం గుర్తు పట్టలేని విధంగా తయారైంది. ప్రమాదం ఏ విధంగా జరిగిందీ అనేది తెలియదని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
ముగిసిన టెన్నిస్ వేసవి శిబిరాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 50 రోజులుగా నిర్వహించిన టెన్నిస్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఉన్న టెక్నాస్ అకాడమీ వేదికగా నిర్వహించిన ఈ శిక్షణ శిబిరాలకు ఉదయం, సాయంత్రం 30 మందికి పైగా పిల్లలు హాజరయ్యారు. ఆఖ రి రెండు రోజులపాటు లీగ్ మ్యాచ్‌లు నిర్వ హించి విజేతలుగా నిలిచిన బాలబాలికలకు బ హుమతులు ప్రధానం చేశారు. శిక్షణలో పా ల్గొన్న ప్లేయర్స్ అందరికీ ప్రాతినిధ్యపు సర్టిఫికెట్లను అందజేశారు. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌వీఎస్‌ఆర్‌కే నేతాజీ, ఉపాధ్యక్షుడు మూల వెంకటరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.విజయ్‌కృష్ణ తదితరులు హాజరై మాట్లాడుతూ జిల్లాలో లాన్‌టెన్నిస్ క్రీడాభివృద్ధికి పనిచేస్తున్నామన్నారు.


