● మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాను దోచేస్తున్నారు
● దుమ్మెత్తిపోసిన వైఎస్సార్‌సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్
టెక్కలి: జిల్లాలో దశాబ్దాల కాలంగా దోపిడీలు, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పెద్ద దోపిడీదారుడు వెన్నుపోటు పార్టీకి చెందిన మంత్రి అచ్చెన్నాయుడు అని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. టెక్కలి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వెన్నుపోటు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతం కావడంతో అది తట్టుకోలేక మంత్రి అచ్చెన్నాయుడు మైక్ పట్టుకుని ఉన్మాదిగా మాట్లాడుతున్నారని తిలక్ దుయ్యబట్టారు. ఈ జిల్లాలో కింజరాపు కుటుంబం గ్రానైట్, ఇసుక, మద్యం, చివరకు ఊకలో సైతం అక్రమాలకు పాల్పడిందని తెలిపారు. ఒకరు భోగాపురం పోర్టు, మరొకరు మూలపేట పోర్టుతో పాటు ఇద్దరు సోదరులు విజిలెన్స్ అధికారం, మైన్స్, ధాన్యం, ఊకలో అక్రమాలు చేసుకుంటున్నారని తిలక్ దుయ్యబట్టారు. ఇటీవల జిల్లాలో సుమారు 11 కోట్ల రూపాయలతో సీఎంఆర్ బియ్యం అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ ఎందుకు వేయ లేదని తిలక్ ప్రశ్నించారు. సీఎంఆర్ బియ్యం, ఊక అక్రమాల్లో కింజరాపు కుటుంబానికి ఎంత వాటాలు చేరాయని తిలక్ నిలదీశారు. ఎన్నికల మునుపు ఇచ్చిన హామీల్లో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, పూర్తి స్థాయి బస్సుల్లో ఉచిత ప్ర యాణం, లబ్దిదారులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేకపోయారని, అందుకే వెన్నుపోటు పార్టీగా పిలుస్తున్నారని తిలక్ గుర్తు చేశారు.
వ్యవసాయ శాఖకు అచ్చెన్నాయుడు మంత్రిగా ఉండడం పెద్ద అరిష్టంగా మారిందన్నారు. రైతులు వరి వేయొద్దని చెప్పడం సిగ్గుచేటుగా లేదా అని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని నిర్వీ ర్యం చేయడానికి కుట్ర పన్నుతున్నారని అన్నా రు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కాకుండా సొసైటీల ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన ఆదేశాల వెనుక పెద్ద అవినీతి జరగబోతోదని తిలక్ పేర్కొన్నా రు. మోంథా తుఫాన్ బాధితులకు రూపాయి పరిహారం ఇవ్వలేదన్నారు. ఓటర్ల జాబితా సమ గ్ర సర్వే పారదర్శకంగా నిర్వహించాలన్నారు. టెక్కలి నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు మ్యాపింగ్ చేశారని ఇందులో ఆర్డీఓ తన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, నాయకులు సంపతిరావు హేమసుందర్‌రాజు, కిల్లి అజయ్‌కుమార్, చిన్ని జోగారావు, ఎస్.జనార్ధన్‌రెడ్డి, బడ్డ రాజేష్, ఎస్.వినోద్, కె.జీవన్ తదితరులు ఉన్నారు.


