హార్డ్‌వేర్‌ షాపులో చోరీ | - | Sakshi
Sakshi News home page

హార్డ్‌వేర్‌ షాపులో చోరీ

Jun 17 2026 12:46 AM | Updated on Jun 17 2026 12:46 AM

టెక్కలి రూరల్‌: స్థానిక అయ్యప్ప నగర్‌లో గల ఒక హార్డ్‌వేర్‌ షాపులో మంగళవారం చోరీ జరిగింది. ఈ మేరకు షాపు యజమాని, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మంగళవారం షాపు యజ మాని తిరుమల రావు షాపులోకి వెళ్లే సమయానికి షాపు వెలుపలి భాగంలో తలుపులు తెరిచి ఉండటం గుర్తించి లోపలకి వెళ్లి పరిశీలించగా క్యాష్‌ కౌంటర్లు తెరిచి ఉన్నాయి. ఒక కౌంటర్‌లో ఉన్న సుమారు రూ.1లక్ష50 వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. షాపు వెలుపలి సీసీ కెమెరాలకు గుడ్డలతో కప్పేసి షాపులోని సీసీ కెమెరాలు కట్‌ చేసి ఉండటం గుర్తించారు. అనంతరం పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే గత కొద్ది రోజులుగా టెక్కలి పరిధిలో జరుగుతున్న చోరీలతో ప్రజలు భయపడుతున్నారు.

కొద్ది రోజుల కిందట వేంకటేశ్వర కాలనీ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఒక ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అది మరువక ముందే స్థానిక సంతోషిమాత ఆలయంలో చోరీ జరిగింది. అది జరిగి 20 రోజులు కాకముందే మరో చోరీ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement