నందిగాం: గ్రానైట్ బ్లాక్‌తో వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో బ్లాక్ ముందుకు జరిగి క్యాబిన్ వరకు వచ్చి ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. వివరాలను పరిశీలిస్తే.. కోటబొమ్మాళి మండలం కొత్తపల్లికి చెందిన మిత్ర గ్రానైట్‌కు చెందిన 36 టన్నుల బ్లాక్‌ను లారీలో నందిగాం మండలం కొండతెంబూరు వద్ద ఉన్న సన్ ఇండియా గ్రానైట్ పాలిషింగ్ యూనిట్‌కు తరలిస్తుండగా నందిగాం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో, గ్రానైట్ తరలిస్తున్న లారీ డ్రైవర్ కూడా సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. దీంతో గ్రానైట్ బ్లాక్ ముందుకు జరిగి డ్రైవర్ క్యాబిన్ వర కు వెళ్లి ఆగింది. దీంతో ప్రమాదం తప్పింది. అనంతరం క్రేన్ల సాయంతో బ్లాక్‌ను వెనక్కి జరిపారు.


