ఇచ్ఛాపురం రూరల్:
రాష్ట్రానికి ప్రవేశ ద్వారంగా ఉన్న ఇచ్ఛాపురం గంజాయి అక్రమ రవాణాకు ప్రధాన మార్గంగా మారుతోంది. ఒడిశా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతా ల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు గంజాయిని తరలించేందుకు స్మగ్లర్లు ఇక్కడి రైలు, జాతీయ రహదారి మార్గాలను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు వరుసగా వెలుగు చూస్తున్న కేసులు సూచిస్తున్నాయి. పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు తరచూ దాడులు నిర్వహించి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నా.. అక్రమ రవాణా మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదని స్థానికులు అంటున్నారు.
రెండేళ్లలో పెరిగిన కేసులు
ప్రస్తుత టీడీపీ పాలన రెండేళ్ల కాలంలో ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో నమోదైన గంజాయి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికార గణాంకాలు సూచిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న గంజాయి పరిమాణం కూడా గతంతో పోలిస్తే అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గంజాయి వంటి మత్తుపదార్థాల అక్రమ రవాణాకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆంధ్రా–ఒడిశా పరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పా టు చేసింది. గంజాయి సాగు, రవాణాపై పోలీసులు, ఎకై ్సజ్ శాఖలు సంయుక్తంగా దాడులు చేసేవి. జాతీయ రహదారులు, చెక్‌పోస్టుల వద్ద వాహనాలు తనిఖీలు చేసేవారు. రైల్వే స్టేషన్లలో రైల్వే పోలీసులతో సమన్వయం పెంచుకుని అంతర్రాష్ట్ర సమాచార మార్పిడి ద్వారా స్మగ్లర్లపై నిఘాతో గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపట్టినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఇచ్ఛాపురం మీదుగా వరుసగా గంజాయి కేసులు వెలుగు చూస్తుండటంతో నిఘా వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో పర్యవేక్షణ బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా, అక్రమ రవాణాను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు అవసరమని ప్రజలు కోరుతున్నారు.
యువత భవిష్యత్‌కు ముప్పు
గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువతను వ్యసనాలకు బానిసలుగా మారుస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యా ర్థులు, యువకులు మాదక ద్రవ్యాల ప్రభావానికి లోనైతే వారి విద్య, ఉపాధి, కుటుంబ జీవితం దెబ్బతింటుందని చెబుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు యువకులు రవాణా ముఠాలకు సహకరిస్తుండటంతో మరింత ప్రమాదకరంగా మారింది.
గత నెలలో ఇచ్ఛాపురం మండలం కేదారిపురం గ్రామానికి చెందిన భుక్త బలరాం అనే యువకుడు 2.100 కిలోల గంజాయితో పట్టుపడటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జిల్లా పోలీస్ స్టేషన్‌కు తరలించగా, మరుసటి రోజు ఏప్రిల్ 7న బాత్‌రూమ్ కిటికీకి తువ్వాలును మెడకు చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధి లోని పురుషోత్తపురం గ్రామానికి చెందిన 23 ఏళ్ల బుగ్గ చిరంజీవి ఒడిశా రాష్ట్రం చంద్రగిరి ప్రాంతానికి చెందిన మాన్యువల్ బీరా, టీన్ఫోరియా గ్రామానికి చెందిన రవీంద్రసేధి, సింహాచల్ సేధి తదితరుల
దాడులు చేస్తున్నాం
ఎస్పీ ఆదేశాలు మేరకు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాం. సరిహద్దులను రవాణా కేంద్రాలుగా చేసుకొని కొంత మంది అక్రమ వ్యాపారాలు సాగిస్తున్న నేపథ్యంలో ముఖ్య కూడళ్లలో, రైల్వే కూడళ్లలో నిఘా పెట్టి వరుస దాడులు చేస్తున్నాం. యువతకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి తెర వెనుక మాఫియా దందా సాగిస్తున్నట్లు సమాచారంతో వారిపై నిఘా ఉంచడం జరిగింది. కేవలం పట్టివేతలకే పరిమితం కాకుండా సరఫరా గొలు సును పూర్తిగా ఛేదించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా రాపిడ్ టెస్ట్‌ల ద్వారా గంజాయి వినియోగదారులను గుర్తిస్తున్నాం.
– మీసాల చిన్నంనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం
రైళ్లు, రహదారులే ప్రధాన మార్గాలు
నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ లారీ డ్రైవర్లు తదితరులకు విక్రయిస్తుండటంతో పాటు తమిళనాడుకు చెందిన గంజాయి వ్యాపారి రమేష్ వేలాయుధంకు కూడా అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీటన్నింటిపై గతంలో ఇతనిపై పలు కేసులు నమోదయ్యాయి.
ఐదేళ్లలో ఇచ్ఛాపురం సర్కిల్‌లో నమోదైన గంజాయి కేసులు
సంవత్సరం కేసులు కిలోలు ఖరీదు వాహనాలు అరెస్టయిన వారు
2022 04 162.01 రూ.4,86,030 02 19
2023 05 112.390 రూ.2,84,370 03 20
2024 20 371.51 రూ.8,94,930 00 84
2025 42 642.870 రూ.21,58,790 07 79
2026 08 85.28 రూ.1,95,840 01 16
(నేటి వరకు)
ఇచ్ఛాపురం మీదుగా వెళ్లే ప్రధాన రైల్వే మార్గం, జాతీయ రహదారి–16 గంజాయి రవాణాదారులకు అనుకూలంగా మారింది. రైళ్లలో ప్ర యాణికుల వేషంలో, బస్సులు, కార్లు, లారీలలో ప్రత్యేకంగా దాచి పెట్టి గంజాయిని తరలిస్తున్న ఘటనలు తరచూ బయటపడుతున్నా యి. 90 శాతం కేసులు స్థానిక రైలు మార్గంలో పోలీసులకు చిక్కినవే.


