ఎన్నికల కమిషన్ అధికారికంగా నిర్వహిస్తు న్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్‌ఐఆర్) ప్రక్రియ చాలా కీలకమని, దీనిలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మన ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షు డు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోంపేట పట్టణంలోని వీబీఆర్ కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఇచ్ఛాపురం నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ సీపీ బూత్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఓటరును కాపాడుకోవాలని పార్టీ ‘సర్’ కార్యక్రమం రాష్ట్ర పరిశీలకుడు హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మన ఓటుతోపాటు మన పార్టీ మద్దతుదారుల ఓటు కాపాడుకోవటమే మన పార్టీ 2029 గెలుపునకు నాంది అన్నారు. సర్ కార్యక్రమంలో భాగంగా నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు సైనికుల్లా పనిచేయాలని పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు.
– కంచిలి, సోంపేట


