రణస్థలం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కొమర లక్ష్మణ శనివారం చింతపల్లి సమీపంలో సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. దీంతో ఆదివారం రణస్థలం మండలంలోని కొవ్వాడ సముద్ర తీరంలో కొమర లక్ష్మణ మృతదేహం లభ్యమైంది. జే.ఆర్.పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
పీఆర్ ఏఈ కృష్ణారావుకు సన్మానం
టెక్కలి: టెక్కలి డివిజన్ పంచాయతీరాజ్ ఏఈ కణితి కృష్ణారావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆదివారం పట్టణంలో ఆత్మీయులు, అధికారుల సమక్షంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణారావు, సుబ్బమ్మ దంపతులను సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో ఈఈ సూర్యప్రకాశ్, ప్రదీప్‌కుమార్, విశ్రాంత ఎస్‌ఈ కేఎంవీ ప్రసాదరావు, కేసీహెచ్ మహంతి, మురళీమోహన్, మందస, కంచిలి ఎంపీపీలు డి.దానయ్య, పి.దేవదాస్‌రెడ్డి, కంచిలి ఎంపీడీవో వి.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
సత్ప్రవర్తనతో నడుచుకోవాలి
శ్రీకాకుళం క్రైమ్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, సత్ప్రవర్తనతో నడుచుకోవాలని జిల్లాలో రౌడీషీటర్లను పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు నగరంలోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ఎం.హరికృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎవరైనా భూకబ్జాలు, ఆర్థిక లావాదేవీల్లో పాల్గొంటే సహించేది లేదని స్పష్టం చేశారు.
విజయనగరం క్రైమ్: శ్రీకాకుళానికి చెందిన దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఉంటున్న ఓ రూమ్‌లో ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్‌నగర్ కాలనీలో రూమ్ తీసుకుని గ్రూప్–2,పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. రూమ్ పక్కనే ఉన్న రీడింగ్ రూమ్‌కు చదువుకోవడానికి వెళ్లి తిరిగి రూమ్‌కు వచ్చి తనకు పని ఉందని సహచర స్నేహితురాలు మౌనికకు చెప్పి పై రూమ్‌లోకి వెళ్లింది. ఎంతకీ దుర్గాభవాని పై రూమ్‌లోనుంచి రాకపోవడంతో మౌనిక వెంటనే విజయనగరంలోనే ఉంటున్న దుర్గాభవాని సోదరుడికి ఫోన్‌లో విషయం తెలియజేసింది. దీంతో సోదరుడు వెంటనే వచ్చి పై రూమ్ తలుపులు పగలగొట్టి లోపల దుర్గాభవాని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి ఆమెను కిందికి దించి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


