శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): యాదవులను బీసీ–డీ నుంచి బీసీ–ఏ కేటగిరిలోకి మార్చాలని ఎమ్మెల్సీ, యాదవ సంఘం అధ్యక్షుడు నర్తు రామారావు కోరారు. నగరంలోని ఒక ప్రైవేట్ భవనంలో యాదవ విద్యా వైజ్ఞానిక చైతన్య సదస్సు–2026, ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నర్తు రామారావు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలాలు జనాభా ప్రాతిపదికన యాదవులకి దక్కాలన్నారు. యాదవ కులానికి చెందిన నిరుపేద విద్యార్థులు గ్రూప్–1, 2లకు ప్రిపేర్ అయితే ఆర్థిక సాయం అందిస్తామన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐఐటీలో ఉత్తమ ఫలితాలు సాధించినవారికి ప్రోత్సాహకాలు అందించనున్నామన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులను సత్కరించారు. కార్యక్రమంలో యాదవ ఉద్యోగుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు డొక్కరి ధనుంజయరావు, ప్రధాన కార్యదర్శి కొర్రాయి రామారావు, కూస వెంకటరమణ, నర్తు సోమేశ్వరరావు, మామిడి శ్రీనివాస్, దాసరి ఈశ్వరరావు, వంకల విజయకుమారి, పాలిన శ్రీనివాసరావు, కాళ్ల జయదేవ్, దాసరి రాజు, కుజ్జ తాతారావు, ఇప్పిలి జగదీష్, ఈ.వి.సత్యనారాయణ, కిల్లాన భోజ్‌కుమార్, వంజరాపు రాజులు, గద్దిబోయిన కృష్ణయాదవ్, కలగ గోపాల్, వెంకటరమణ, గజ్జి షన్ముఖ, వంజరాపు కసవయ్య, కిల్లాన శ్రీనివాస్, కిల్లాన ఫల్గుణరావు, ఇప్పిలి జగదీష్, సబ్సి జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు.


