నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

నూతన కార్యవర్గం ఎన్నిక

Jun 1 2026 12:56 AM | Updated on Jun 1 2026 12:56 AM

శ్రీకాకుళం కల్చరల్‌: ఆంధ్రప్రదేశ్‌ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కీలక నియామకాలు చేపట్టింది. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో పురోహిత క్రికెట్‌ టోర్నమెంట్‌ సందర్భంగా ఆదివారం జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ఈ నియామక పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని నినాదాలు చేశారు. సమాఖ్య వ్యవస్థాపకుడు యామిజాల నరసింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు, పురోహిత సమాజ సర్వతోముఖాభివృద్ధికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఏకగ్రీవ తీర్మానం మేరకు నూతన నియామకాలు చేశారు.

ఇదే నూతన కార్యవర్గం

రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పొదిల నారాయణమూర్తి, రాష్ట్ర అధ్యక్షుడిగా తెన్నేటి విద్యాధర శాస్త్రి సునీల్‌, ప్రధాన కార్యదర్శిగా వారణాసి శ్రీధర్‌ శర్మలు ఎన్నికై నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సీనియర్‌ పురోహిత ప్రముఖులు పురాణం శేషు, పెంటా శ్రీధర్‌ శర్మ, పొన్నాల నరసింహమూర్తి, వాహిణీపతి మణిశర్మ, మేడూరి సంతోష్‌, కూనపల్లి శ్రీనివాస్‌, భోగాపురపు సూర్యనారాయణ, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement