న్యూస్‌రీల్
హాయి చాటున అపాయంఏసీలు ప్రమాదకరంగా మారుతున్నాయి. అక్కడక్కడా పేలుతున్నాయి. –8లో
నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేట పరిధిలోని సంతపేట ఎదురుగా ఉన్న కొత్తకర్ర చెరువు పరిసరాల్లో సీఎం టూర్ సందర్భంగా వేసిన చెత్తను పంచాయతీ అధికారులు ఎట్టకేలకు తొలగించే పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ట్రాక్టర్లతో వందకు పైగా చెత్త లోడులు డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ‘సాక్షి’లో శుక్రవారం ‘కోట్లు పోయాయి.. చెత్త మిగిల్చాయి’ అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారులు వెంటనే స్పందించారు. శుక్ర, శనివారాల్లో కొత్త కర్ర చెరువు వద్ద వేసిన చెత్త తొలగించే పనులు చురుగ్గా చేపట్టారు. స్వయంగా జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి చెరువు వద్ద వేసిన చెత్తను పరిశీలించి స్థానిక ఈఓ ద్రాక్షాయినికి, పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశా రు. దీంతో ఆమె పంచాయతీ ట్రాక్టర్లు, జేసీబీ సహకారంతో చెత్తను తొలగించే పనులు చేయిస్తున్నారు. ఆదివారం నాటికి చెత్తను పూర్తిగా తొలగిస్తామని ఈఓ అన్నారు. మళ్లీ ఈ పరిసరాల్లో చెత్త వేయవద్దని ఆమె సూచించారు. ఈ మేరకు బోర్డులు పెడతామన్నారు.


