నృత్య పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శనతో గుర్తింపు పొందాలని ఆసక్తితో శిక్షణ తీసుకుంటున్నా.స్టేజ్‌పై నృత్య ప్రదర్శన ఇవ్వాలని కోరిక. నృత్య గురువు మంచి శిక్షణ ఇస్తున్నారు.
– మోక్ష, 7వ తరగతి, దమ్మలవీధి
డ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే శిక్షణ పొందుతున్నా. నా సోదరితో పాటు క్లాస్‌కు వస్తున్నా.
– తన్మయి, 6వ తరగతి, బాదుర్లపేట
డ్యాన్సు నేర్చుకొని ప్రదర్శ నలు ఇస్తా. టీవీల్లో చూసి సి నిమా పాటలకు డ్యాన్సు చే స్తుంటే మా తల్లిదండ్రులు ఇక్కడ వేసవి శిక్షణలో చేర్పించారు. – యశశ్విని, 7వ తరగతి, హౌసింగ్ బోర్డు కాలనీ
శ్రీకాకుళం కల్చరల్: వేసవి సెలవులు ముగింపు దశకు వస్తున్నాయి. సరదాలు, షికార్లతో పాటు ఈ సెలవుల్లో కొందరు నృత్యాలు, గీతాలాపన, చిత్రాలు, శిల్పాల రూపకరణ నేర్చుకున్నారు. జిల్లా కేంద్రంలో నృత్య శిక్షణను చాలా మంది సద్వినియోగం చేసుకున్నారు. పాతశ్రీకాకుళంలోని కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నృత్య గురువు టి.నీరజ సుబ్రహ్మణ్యం ఇస్తున్న శిక్షణకు హాజరవుతూ తమలోని టాలెంట్‌కు పదును పెడుతున్నారు. ఈ చిన్నారులు ప్రతి రోజూ ఉదయం భరత నాట్యం, కూచిపూడిలో శిక్షణ పొందుతున్నారు. జూన్ 4 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఉచితంగా నేర్పుతున్న వేసవి శిబిరానికి ఎంతో మంది చిన్నారులు నేర్చుకునేందుకు వస్తున్నారు. వీరిలో కొందరితో వేసవి శిబిరం ముగింపు సమయంలో ప్రదర్శన ఇప్పించేందుకు తగిన తర్ఫీదు ఇస్తున్నా. చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
– టి.నీరజ, నాట్య గురువు


