ఏపీపీ ఈసీఈ పరీక్ష పరిశీలకునిగా శ్రీనివాసరావు | - | Sakshi
Sakshi News home page

ఏపీపీ ఈసీఈ పరీక్ష పరిశీలకునిగా శ్రీనివాసరావు

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

ఏపీపీ ఈసీఈ పరీక్ష పరిశీలకునిగా శ్రీనివాసరావు పరిశ్రమలో యూరియా నిల్వలపై తనిఖీలు ‘నేత కార్మికుల కోసమే క్లస్టర్‌’ మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ రేపు

ఎచ్చెర్ల: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌–1 డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు ఏపీపీ ఈసీఈ–2026కు పరీక్ష పరిశీలకునిగా నియమితులయ్యారు. రెండేళ్ల డీపీఈడీ, బీపీఈడీల్లో ప్రవేశానికి వచ్చే నెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ ఈ పరీక్షలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు) క్యాంపస్‌ కేంద్రంగా నిర్వహించనుంది. ఈ పరీక్షల్లో భాగంగా నిర్వహించే శారీరక దారు ఢ్యం, క్రీడా నైపుణ్యాలు వంటి వాటిని పరిశీలించి పర్యవేక్షించేందుకు డాక్టర్‌ శ్రీనివాసరావును నాగార్జున వర్సిటీ నియమించింది. ఈ నియామకంపై వర్సిటీ వర్గాలు ఆయనకు అభినందనలు తెలిపాయి.

రణస్థలం: రైతులకు ఇచ్చే యూరియాను పరిశ్రమల్లో అక్రమంగా నిల్వ ఉంచడం చట్టరీత్యా నేరమని వ్యవసాయశాఖ జేడీఏ వైవీ మురళీకృష్ణ తెలిపారు. మండలంలోని యునైటెడ్‌ బ్రూవరీస్‌, లిక్వినాక్స్‌ గ్యాస్‌ పరిశ్రమలో యూరియా నిల్వలపై వ్యవసాయశాఖ, రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగంతో కూడిన టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌ సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో సోదాలు చేసి అక్రమ నిల్వలు లేవని గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం యూరియా అక్రమ నిల్వలు ఉంచి తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పొందూరు: పొందూరులో చేనేత, ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుతో నేత కార్మికులతో పాటు, వడుకు కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. మండలంలో రాపాక కూడలికి సమీపంలో ఏర్పాటు చేయనున్న ఖాదీ, చేనేత క్లస్టర్‌ల ఏర్పాటు కో సం రెవెన్యూ అధికారులు సూచించిన సర్వేనంబర్‌ 310–9లో స్థలాన్ని శనివారం పరిశీలించారు. క్లస్టర్‌కు 5 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ స్థలానికి ఎలాంటి సాంకేతిక సమ స్యలు ఉన్నా వెంటనే పరిష్కరించి స్థలాన్ని సిద్ధం చేయాలని తహసీల్దార్‌ ఆర్‌.వెంకటేష్‌ను ఆదేశించారు. క్లస్టర్‌ ఏర్పాటుతో ఖాదీ, చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు విస్తృత మా ర్కెట్‌ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అనంతరం పొందూరులోని సాయి బాబా చేనేత సహకార సంఘం ఆవరణలో ఉన్న భవనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్‌ వెంట ఎంపీఈడీఓ ఎస్‌.వాసుదేవరావు, మేజర్‌ పంచాయతీ ఈఓ పి.జగదీష్‌, ఏపీఓ శ్రీనివాసరావు ఉన్నారు.

శ్రీకాకుళం అర్బన్‌: మలేరియా వ్యతిరేక మాసో త్సవ ర్యాలీ జూన్‌ నెల ఒకటో తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్‌ కె.అనిత తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ‘మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు’ సందర్భంగా శ్రీకాకుళం వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం నుంచి ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీకి సిబ్బంది మధ్యాహ్నం 3.30 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement