సంగీత మహిమకు గిన్నిస్‌ దాసోహం | - | Sakshi
Sakshi News home page

సంగీత మహిమకు గిన్నిస్‌ దాసోహం

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

సంగీత మహిమకు గిన్నిస్‌ దాసోహం

పోలాకి: మండలంలోని కొవిరిపేట గ్రామానికి చెందిన చోడిపిల్లి మహిమకు గిన్నిస్‌ రికార్డ్‌లో చోటు లభించింది. పుట్టుక నుంచి ప్రత్యేక అవసరాలు కలిగిన మహిమ ఏదైనా నైపు ణ్యాన్ని సంపాదించాలని పట్టుదలగా ఉండేది. కుమార్తె కోరిక మేరకు తల్లిదండ్రులు ఆమెకు కీ బోర్డు నేర్పించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి విక్టరీ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన గిన్నిస్‌ అచీవర్స్‌ మీట్‌లో మహిమ కీబోర్డును గంటపాటు నిరంతరాయంగా వాయించి రికార్డు సృష్టించింది. హల్లెల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 22 దేశాల నుంచి 2వేల మంది వాద్య కారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చినందున నిర్వాహక సంస్థ వ్యవస్థాపకుడు అగస్టిన్‌ దండింగి ఆధ్వర్యంలో అవార్డు అందించారు. మహిమ తల్లిదండ్రులు స్టీఫెన్‌రావు, మార్తలు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement