నరసన్నపేట:
కూటమి తన సంప్రదాయాన్ని కొనసాగించింది. గత ఖరీఫ్‌లో విత్తనాల నుంచి విక్రయాల వరకు ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోగా మద్దతు ధరలకు పంటను కొనుగోలు చేయక రైతులకు కూటమి ప్రభుత్వం తీవ్ర నష్టాలకు గురి చే స్తోంది. తాము అధికారంలోకి వస్తే కేంద్రంతో సంబంధం లేకుండా ఏటా రూ.20వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన రూ.6 వేలుతో కలిపి రూ. 20 వేలు ఇస్తున్నారు. ఇలా ప్రతి పథకంలోనూ మెలికలు పెడుతూ రైతులను మోసగిస్తున్న సర్కారు వెనకా ముందూ చూడకుండా ఈ ఖరీఫ్‌కు ఎరువుల ధర లు పెంచేసింది. ఇప్పటికే ఇంధనం ధరల పెంపుతో సతమతమవుతుంటే.. ఎరువుల ధరలు కూడా పెం
జిల్లాలో ఖరీఫ్‌లో 4.50 లక్షలు రబీలో 2.60 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో ఎక్కువగా వరి పండిస్తున్నారు. రబీలో అయితే మొక్కజొన్న, పత్తి, చెరకు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు బస్తా ధర (50 కేజీలు) రూ. 125 నుంచి రూ. 700 వరకూ పెరిగింది. సగటున ఎకరాకు మూడు బస్తాలు ఎరువులు వినియోగిస్తే రైతులపై ఒక సీజన్‌కు రూ. 600 నుంచి రూ. 1400 వరకూ భారం పడుతుంది. ఈ లెక్కన చూస్తే ఖరీ ఫ్, రబీల్లో రైతులపై రూ. 40 కోట్లకు పైగా అదనపు భారం పడుతుంది. 20.20.0.13 ఎరువు అయితే ఏకంగా రూ. 700 పెంచారు. ఈ విషయం తెలియడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
చడంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అధికంగా వాడే కాంప్లెక్స్ ఎరువుల ధర లను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా మండల కేంద్రాలకు చేరాయి. రానున్న ఖరీఫ్‌కు రైతులు ఎరువులు కావాలంటే కొత్త ధరలతోనే బుక్ చేసుకోవాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచనలు చేస్తున్నారు. యూరియా, డీఏపీ మినహా మిగిలిన ఎరువులు అన్నింటి ధరలు పెరిగాయి. దీంతో రైతులు ఈ ఖరీఫ్‌లో అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం డీఏపీ సరఫ రా తగ్గడంతో రైతులు వరికి కూడా కాంప్లెక్స్ ఎరువులనే వినియోగిస్తున్నారు.
రూ. 40 కోట్ల వరకూ భారం


