శ్రీకాకుళం: మండు వేసవిలో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అడ్మిషన్ డ్రైవ్ పేరుతో ఒత్తిడి చేయడం తగదని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేష న్ జిల్లా గౌరవాధ్యక్షులు పేడాడ కృష్ణారావు తెలిపారు. డీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం శ్రీకాకుళం పెన్షనర్స్ భవన్‌లో శుక్రవారం జరిగింది. పాఠశాలలకు సెలవులు ఇచ్చినప్పటి నుంచి ఎంతో నిబద్ధతతో ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయ సిబ్బంది అడ్మిషన్ల కోసం సాయశక్తులా కృషి చేస్తున్నారని, అయినప్ప టికీ టార్గెట్ పూర్తి చేయాలని, ప్రైవేటు పాఠశాలల నుంచి పిల్లలను చేర్పించాలని ప్ర తిరోజూ ఒత్తిడి చేస్తూ ఇబ్బందులకు గురి చేయ డం తగదని అన్నారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పూజారి హరిప్రసన్న మాట్లాడుతూ టెన్త్ మూల్యాంకనానికి సంబంధించి రెమ్యూనరేషన్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆమదాలవలస: ఆమదాలవలస మండలంలో తోటాడ, అక్కివరం రెవెన్యూ గ్రామాల్లో కొత్తరోడ్డు సమీపంలో గల విలువైన బావాజీ మఠం భూములపై వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ లోకాయుక్తను ఆశ్రయించారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ భూములను అన్యాక్రాంతం చేసి ఆయన అనుచరులతో అక్రమ లే అవుట్‌లు వేసి వాటికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సిమెంట్ సీసీ రోడ్లు, కాలువలు నిర్మించి భూ ములను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కర్నూలులో ఏపీ లోకాయుక్తకు గురువారం ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం తెలిపారు. కూన రవికుమార్ తన అనుచరులతో ఆ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని, ఇప్పటికే ఆ భూములపై కోర్టులో పలు వివాదాలు నడుస్తున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు చింతాడ రవికుమార్ తెలిపారు. జస్టిస్ పి.లక్ష్మారెడ్డి చాంబర్‌లో ఈ ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. లోకాయుక్తను ఆశ్రయించడంతో నిజా నిజాలు బహిర్గతం అవుతాయని, దీంతో అక్రమార్కులకు చెక్ పడుతుందని స్థానికులు ఆశిస్తున్నారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: మరో రెండు రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్మీడియెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులను మరో ఐదు రోజులు పొడిగించింది. వాస్తవానికి నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జూనియర్ కళాశాలలు జూన్ ఒకటో తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పబ్లిక్ పరీక్షలు జూన్ 5వ తేదీ వరకు జరుగుతుండటంతో ఇంటర్‌బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇటీవల బక్రీద్ కారణంగా ఈనెల 28న జరగాల్సిన పరీక్షలను జూన్ 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. దీంతో 6వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ ఆదేశాలు అ న్ని ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్, ప్రైవేట్, కోఆపరేటివ్ జూనియర్ కాలేజీలన్నింటికీ వర్తిస్తాయని ఇంటర్‌బోర్డు పేరొంది.


