శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కూటమి ప్రభుత్వం నిరుపేదలు మొదలుకుని నిరుద్యోగ యువత వరకు అందరినీ దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలో పెద్దపాడు ధర్మాన ప్రసాదరావు క్యాంప్ కార్యాలయంలో పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులతో సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ జూన్ 1వ తేదీన నిర్వహించనున్న దగా డీఎస్సీ కార్యక్రమం విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వ రూప్, రాష్ట్ర కార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ముత్తా విజయ్‌కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ, బీసీ వి భాగం జిల్లా అధ్యక్షులు మార్పు అశోక్ చక్రవర్తిలతో పాటు నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొన్నారు.
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని దగా డీఎస్సీ అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన అనంతరం మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై ఏడాదిగా పీఈటీలు పోరాటం చేస్తున్నార ని గుర్తు చేశారు. డీఎస్సీ పద్ధతిగా నిర్వహించలేదని, అన్ని స్థాయిల్లోనూ అక్రమాలు జరిగాయని ఆ రోపించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు వెన్నుపోటు పేరుతో ప్రజల్లోకి వెళ్తామని, జూన్ 4వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని పే ర్కొన్నారు. మహానాడు అంతా జగన్ నామస్మరణతోనే గడిచిందని చురకలు అంటించారు.


