డీఎస్సీ పరీక్ష పేపర్ లీకై ంది. దీని వెనుక కూటమి నాయకులు ఉన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి. లీక్ వ్యవహారంతోనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ అయ్యారు. అవినీతి ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఇదే ఉదాహర ణ. సాధారణంగా మెరిట్ లిస్టు, సెలెక్షన్ లిస్టు, రోస్టర్ వంటివి ఉంటాయి. కానీ ఈ డీఎస్సీలో ఇలాంటివి ఏవీ జరగలేదు. మెరిట్ జాబితా లేకుండా ఉద్యోగ నియామకాలు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలి. అవినీతికి పాల్పడిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
– మెంటాడ స్వరూప్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు
డీఎస్సీ పరీక్షల నుంచి నియామకాల వరకు అన్ని స్థాయిల్లో అవినీతి జరిగింది. స్పోర్ట్స్ కోటా లో టీచర్ పోస్టు రూ.15 లక్షలు వరకు అమ్ముడుపోయినట్టు వీడియోలు వెలుగు చూశాయి. ఇప్పటిౖకైనా ఉన్నత న్యాయస్థానం, గవర్నర్ సుమోటోగా తీసుకొని విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– ముత్తా విజయ్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు
డీఎస్సీలో అవకతవకల వల్ల నష్టపోయిన వారిలో నేనున్నాను. నాకు ఇవ్వాల్సిన సోషల్ రిజర్వేషన్ లో టాపర్‌ని అయినా నాకు ఉద్యోగం ఇవ్వలేదు. అడిగితే సమాధానం చెప్పడం లేదు. మెరిట్ లిస్టు ఇవ్వకపోవడం వల్ల నాలా అభ్యర్థులంతా నష్టపోయారు.
– కె.అనిల్‌కుమార్, డీఎస్సీ బాధితుడు


