రైతు బేల చూపులు | - | Sakshi
Sakshi News home page

రైతు బేల చూపులు

May 30 2026 8:53 AM | Updated on May 30 2026 8:53 AM

రైతు బేల చూపులు ఆక్వా రైతులను ఆదుకోవాలి ఆక్వా రైతులకు నష్టాలే

రొయ్య నేల చూపులు..

నష్టాల్లో ఆక్వా రైతులు

ఆదుకోవాలని వేడుకోలు

ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. రొయ్యల మేత, మెడిసిన్‌ ధరలు పెరిగిన రొయ్యల ధర మాత్రం తగ్గుతోంది. అదనపు పెట్టుబడితో నష్టాలు బాట పడుతున్నాం.

– రాంబాబు, ఆక్వారైతు, మూలపేట

రొయ్యల మేత రేట్లు, మెడిసిన్‌ రేట్లు, ఇతర సా మగ్రి రేట్లు పెరిగినా రొయ్యల ధర మాత్రం ఎప్పటికీ పెరగడం లేదు. కష్టాలు, నష్టాలే మిగు లుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించాలి.

– రవికుమార్‌, ఆక్వా రైతు, సీతానగరం

సంతబొమ్మాళి: రొయ్య ధర పతనంలో ఆక్వా రైతు లు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఒడిదొడుకుల ను ఎదుర్కొంటూ సాగు చేస్తున్న రైతులకు మాత్రం కష్టనష్టాలు తప్పడం లేదు. ఆక్వా సాగులో పెట్టుబడులు రూ.లక్షల్లో ఉండగా లాభాలు మాత్రం రావడం లేదని అంటున్నారు. మరో వైపు రొయ్యల మేత, మెడిసిన్‌ ధరలు పెరుగుతున్నా రొయ్యల ధర లు తగ్గడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలో నౌపడ, సీతానగరం, సెలగపేట, మర్రిపా డు, భావనసాడు, మూలపేట, కె.లింగూడు, సున్నాపల్లి, వడ్డీతాంద్ర, పోతునాయుడుపేట, యామలపే ట, జగన్నాథపురం, ఉమిలాడ, ఆర్‌హెచ్‌పురం, మలగాం, కొల్లిపాడు, మరువాడ, మేఘవరం తదితర గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల్లో ఆక్వా సాగును చేపడుతున్నారు. ప్రారంభంలో ఆక్వా సాగు ఆశాజనకంగా ఉన్నా తర్వాత పరిస్థితులు మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రొయ్యల మేత కిలోకు నాలుగు రూపాయిలు చొప్పన పెంచిన తయారీ సంస్థలు మరోసారి పెంచడానికి సిద్ధమ వుతుడడంపై ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు పెరుగుతుంటే.. రొయ్యల ధర మాత్రం నేల చూపు చూస్తోంది. 100 కౌంటు రొయ్య ధర రూ. 260లునుంచి రూ. 230కు దిగజారింది. 15 ఏళ్ల కిందట మేత బస్తా రూ. 850లు ఉంటే 100 కౌంటు కిలో రొయ్య ధర రూ. 260 నుంచి రూ. 230లు మధ్యన ఉండేది. ఇప్పుడు అదే మేత బస్తా రూ. 2500లు నుంచి రూ. 2700లకు పెరిగింది. 100 కౌంటు ధర మాత్రం రూ. 210 నుంచి రూ. 230లు మధ్యన ఉంది. రొయ్య మేత, మెడిసిన్‌ ధరలు అమాంతంగా పెరగడం రొయ్యల ధర మాత్రం పాతాళానికి పడిపోవడం రైతులు ఆందోళ న చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement