చెత్త మిగిల్చాయి | - | Sakshi
Sakshi News home page

చెత్త మిగిల్చాయి

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

సీఎం టూర్‌.. పారిశుద్ధ్యం పూర్‌! పోయాయి

సీఎం టూర్‌.. పారిశుద్ధ్యం పూర్‌!

కోట్లు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

ముఖ్యమంత్రి పర్యటన జిల్లాకు మేలు చేయాల్సింది పోయి కొత్త తలనొప్పులు తీసుకువచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నరసన్నపేటలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనతో ప్రజలకు ఇబ్బందులు, ప్రభుత్వానికి ఖర్చులు, పార్టీకి పబ్లిసిటీ తప్ప ఇంకేమీ మిగల్లేదు. స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర ప్రొగ్రామ్‌ అక్కరకు రాలేదు సరికదా కొత్త సమస్యలను సృష్టించింది. ఆయన పర్యటన కోసం చేసిన హడావుడి ఆ తర్వాత లేకపోవడంతో పరిస్థితులు దయనీయంగా తయారయ్యాయి. పారిశుద్ధ్యం నిర్వహణ పక్కన పెడితే ఆయన పర్యటన కోసం కొత్త కర్ర చెరువు వద్ద వేసిన చెత్త కొత్త ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. అటు అధికారులు, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సంతతోట ఎదురుగా ఉన్న ప్రాంతం తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది.

డంపింగ్‌ యార్డ్‌గా కొత్త కర్ర చెరువు..

● సీఎం చంద్రబాబు పర్యటన కోసం నరసన్నపేటలో వార్డుకి 10 మంది చొప్పున 20 వార్డుల్లో 200 మందితో వారం రోజుల పాటు చెత్త, వ్యర్థ పదార్ధాలను జేసీబీ, ట్రాక్టర్లతో ఎత్తి సంత తోట ఎదురుగా ఉన్న కొత్త కర్ర చెరువు వద్ద డంప్‌ చేశారు.

● నరసన్నపేటలో డంపింగ్‌ యార్డు ఉన్నప్పటికీ సీ ఎం పర్యటన కోసం సమయం సరిపోదని దగ్గరలో ఉన్న కొత్త కర్ర చెరువు వద్ద రోడ్డుపై వేసేశారు.

● సీఎం పర్యటన ముగియగానే అక్కడున్న చెత్తను ఎత్తేస్తామని చెప్పారు.

● కానీ, రెండు వారాలు అవుతున్నా అక్కడ వేసిన చెత్తను తరలించలేదు. దీంతో దుర్గంధంగా తయారైంది. అటువైపు వెళ్లే వారంతా ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. సమీపంలో ఉన్న నివాసితులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

సంపద కేంద్రం వద్దనైతే..

సీఎం సందర్శన కోసం చెత్త నుంచి సంపద కేంద్రంలో అప్పటికప్పుడు రూ. 60లక్షలతో హంగులు సమకూర్చి ఆర్బాటం చేశారు. చంద్రబాబు వెళ్లిపోగానే సంపద కేంద్రాన్ని గాలికొదిలేశారు. చంద్రబాబు ఫొటో, వీడియో షూట్‌ చేసిన కార్యక్రమంగా మిగిలిపోయిందే తప్ప వర్కింగ్‌లో తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ‘చెత్త శుద్ధి ఇదేనా అని ‘సాక్షి’లో కథ నం వచ్చాక సంపద కేంద్రానికి తాళాలు తీశారు. కానీ,చంద్రబాబు చెప్పినట్టు సంపద సృష్టించే చర్య లు మొదలు కాలేదు. 2018లో ఎలాగైతే ఉత్సవ విగ్రహంగా వదిలేశారో.. ఈసారి కూడా అదే ధోరణి కనబరుస్తున్నారు. తమకు పబ్లిసిటీ తప్ప ఆచరణ ముఖ్యం కాదని మరోసారి చాటి చెప్పారు.

రూ.కోట్లు ఖర్చు.. ప్రజలకు ఇబ్బందులు

చంద్రబాబు కార్యక్రమానికి జనాలు తరలింపు, ఇతర త్రా ఖర్చులైతే రూ.కోట్లలో అయ్యాయి. ప్రజా ధనం ఖాళీ అయిపోయింది. ఇక చంద్రబాబు వస్తున్నారని సమీపంలో ఉన్నషాపులను మూసివేసి,వర్తకులు ఇబ్బం దులు పెట్టారు. పోనీ, ఇంత చేసి నా నరసన్నపేటకు ఏదైనా మేలు జరిగిందా? అంటే ఏమీ లేదు. అమలు చేయని పాత హామీలు ఇచ్చి చంద్రబాబు వెళ్లిపోయారు. ఆయన వెళ్లాక ప్రజలకు కష్టాలు మిగిల్చారు.

నరసన్నపేట ప్రజలకు చెత్త ఇబ్బందులు

రూ. కోట్లలో ఖర్చు ...ప్రజా ధనం ఖాళీ

ఒక్క మేలు జరగని పరిస్థితి

సీఎం పర్యటన కోసం ఊరి చెత్త అంతా కొత్త కర్ర చెరువు వద్ద డంపింగ్‌

తీవ్ర దుర్గంధంగా మారిన పరిసర

ప్రాంతాలు

Advertisement
 
Advertisement
Advertisement