టీడీపీ మహిళా నేతపై తెలుగు తమ్ముడు దాడి | - | Sakshi
Sakshi News home page

టీడీపీ మహిళా నేతపై తెలుగు తమ్ముడు దాడి

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

ఎస్‌ఎంపురంలో సంధ్య గణపతిరావు చౌదరి కారుపై రాళ్ల దాడి

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్న బాధిత టీడీపీ నాయకురాలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : విజయనగరం జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సంధ్య గణపతిరావు చౌదరిపై అదే పార్టీకి చెందిన నాగులు అనే వ్యక్తి దాడికి పాల్పడ్డారు. ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురం గ్రామంలో ఒకరిని పరామర్శించేందుకు వెళ్లి వస్తుండగా సంధ్య ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి చేశారు. ఆ సమయంలో సంధ్య అనుచరులు రావడంతో అక్కడి నుంచి ఉడాయించిన నాగులు మరో టీడీపీ నేత ఇంటిలోకి వెళ్లి దాక్కున్నాడు. తనపై జరగిన దాడిపై సంధ్య గణపతిరావు చౌదరి పో లీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించలేదని సంధ్య గణపతిరావు ఆరోపించారు. పోలీసు వ్యవస్థ ఇలా తయారైందేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం ఆందోళనకరమన్నారు.

‘భూములు పోతాయంటే పోరాటం తప్పదు’

సోంపేట: కవిటి మండలం శిలగాం గ్రామం వద్ద ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సుమారు 21 ఎకరాల ఉద్యాన శాఖ విలువైన భూములను బడాబాబులకు అప్పగిస్తే పోరాటం తప్పదని మహాత్మా జ్యోతిరావు పూలే రాష్ట్ర బీసీ సంఘం హెచ్చరించింది. గురువారం సోంపేట పట్టణంలోని విజయదుర్గ ఆలయం వద్ద రాష్ట్ర సంఘ అధ్యక్షుడు బీన ఢిల్లీరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఉద్దానమంతా కిడ్నీ వ్యా ధితో సతమతమవుతోందని, ఇలాంటి చోట వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సింది పోయి కాలుష్యం పెంచే కర్మాగారాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయల విలువైన శిలగాం వద్ద గల ఉద్యాన శాఖ భూములను పప్పు బెల్లాల మాదిరిగా కార్పొరేట్లకు పంచి పెడితే పోరాటం తప్పదన్నారు.

‘ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’

శ్రీకాకుళం అర్బన్‌: ఏపీఎస్‌ ఆర్టీసీలో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు ప్రభు త్వం పరిష్కరించాలని ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు తిరుపతిరావు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఏపీఎస్‌ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళంలోని ఈయూ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జిల్లా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఏఐటీయూసీ గౌరవాధ్యక్షులు టి.తిరుపతిరావు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలపై మాట్లాడారు. ఏపీఎస్‌ఆర్టీసీ ప్రైవేటీకరణను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు రూ. 26,000 వేతనం ఇవ్వాలని, జీతాలు సకాలంలో ఇవ్వా లని డిమాండ్‌ చేశారు.

జిల్లాకు చేరిన ఇంటర్‌ పుస్తకాలు

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పాఠ్యపుస్తకాలు చేరాయి. అయితే వీటిని తీసుకెళ్లడానికి మాత్రం ప్రభు త్వ యాజమాన్య విద్యాసంస్థలు అష్టకష్టాలు పడుతున్నాయి. గత ఏడాది పాఠ్యపుస్తకాల పంపిణీలో ఏర్పడిన లొసుగుల నుంచి ఇంటర్మీడియెట్‌ విద్య డైరెక్టరేట్‌ కార్యాలయం తేరుకుంది. ఈ విద్యా సంవత్సరం కాస్త ముందుగానే పాఠ్యపుస్తకాలను చేరవేసినప్పటికీ.. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంలో లోపభూయిష్టత కనిపించిందని విశ్రాంత విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పబ్లిక్‌ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఆయా విద్యా సంస్థల అధికారులు, సిబ్బంది పరీక్షల నిర్వహణ లో నిమగ్నమై ఉన్నారు. దీంతో పుస్తకాలు తీసుకెళ్లలేకపోతున్నారు. గతంలో మండల కేంద్రాలకే నేరుగా పాఠ్యపుస్తకాలను పంపించేవారు. పెద్దగా ఖర్చు అయ్యేదికాదు. ప్రస్తుతానికి పా ఠ్య పుస్తకాలు మాత్రమే వచ్చాయి. నోట్‌బుక్స్‌ గానీ, బ్యాగులు గానీ రాకపోవడం చర్చనీయాంశమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement