వరుసగా వాహనాలు ఢీ | - | Sakshi
Sakshi News home page

వరుసగా వాహనాలు ఢీ

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

రణస్థలం వద్ద స్తంభించిన ట్రాఫిక్‌

రణస్థలం: రణస్థలం ఫ్లై ఓవర్‌ పనులు వాహనచోదకులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు ముందు వెళుతున్న క్రేన్‌ను అధిగమించే ప్రయత్నంలో క్రేన్‌ చివర భాగం బస్సుకు తగిలింది. దీంతో బస్సు అద్దం పగిలిపోయి ప్రయాణికులు కేకలు వేశారు. వెనుకనే వస్తున్న కారు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఆ కారు ఇసుక లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోయినా కారుకు, ప్రైవేటు బస్సు దెబ్బతిన్నాయి. ఈ రెండు ప్రమాదాలతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. హైవే సెక్యూరిటి, స్థానిక పోలీసులు వచ్చి వాహనాలను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంపై ఎటువంటి కేసు నమోదు కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement