టెక్కలి:
టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో వెంకటేశ్వర కాలనీలో ఓ ఇంట్లో దుండగులు చోరీకు పాల్పడ్డారు. కాలనీకు చెందిన బొరిగి లక్ష్మినారాయణ కుటుంబం కొన్ని రోజులుగా స్థానికంగా లేకపోవడంతో మాటు వేసిన దుండగులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ప్రవేశించి 25 కిలోల వెండి, సుమారు 4 తులాల బంగారం, కొంత మొత్తంలో నగదు పట్టుకుపోయారు. గురువారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు బెంగళూరులో తన కుమారుడి వద్ద ఉన్నటువంటి యజమానికి సమాచారం అందజేశారు. ఇదే సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ రాము సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రైమ్ ఏఎస్పీ పి.శ్రీనివాసరావు నేతృత్వంలో క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


