గార: పోలీసు అధికారులు, సిబ్బందిలో మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం ఏకాగ్రత పెంపొందించేందుకు ధ్యాన సాధన ఉపయోగపడుతుందని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. శ్రీకాకుళం నగర పరిధిలోని ఓ ఫంక్షన్‌లో హాలులో ఏర్పాటు చేసిన ధ్యాన కార్యక్రమం బుధవారంతో ముగిసింది. జిల్లాలో ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగం, శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్‌లతో పాటు ఈగల్, ఇంటెలిజెన్సు విభాగాల అధికారులు, సిబ్బందికి ధ్యానం, శ్వాస వ్యాయామాలపై హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ నిపుణులు అవగాహన కల్పించారు. ధ్యానం ద్వారా ఆలోచన శక్తి పెరగడంతో పాటు విధి నిర్వహణలో ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు.
పింఛన్ల పంపిణీపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో పెన్షన్ల పంపిణీ శతశాతం జరగాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలతో పింఛన్ల పంపిణీపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంపిణీలో ఆలస్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయాల సంక్షేమ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రమాబాయి జీవితం స్ఫూర్తిదాయకం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సతీమణి రమాబాయి జీవితం స్ఫూర్తిదాయకమని ఏఐఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను, శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల జేఏసీ అధ్యక్షుడు డా.కంఠ వేణు, జేఏసీ నేతలు బడే కామరాజు, రాయి వేణుగోపాల్, బోనేల రమేష్‌లు అన్నారు. ప్రజల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు అంబేడ్కర్ అయితే.. ఆయన సాధించిన విజయాలకి అన్నివిధాలుగా అండగా నిలిచిన ధీర వనిత రమాబాయి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని కలెక్టర్ కార్యాలయం రోడ్డులో ఉన్న పూలే పార్క్‌లో తైక్వాండో శ్రీను ఏర్పాటు చేసిన రమాబాయి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమె వర్ధంతి సందర్భంగా బుధవారం నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఐఎం, దళిత, బహుజన జేఏసీ నాయకులు కొత్తూరు సత్యనారాయణ, పెయ్యల చంటి, అబ్బాస్, రాహుల్, గజ్జల తేజ, సంతు తదితరులు పాల్గొన్నారు.


