రణస్థలం: మండలంలో కోటపాలెం పంచాయతీలోని యాతవీధిలో మంగళవారం అర్థరాత్రి నాలుగు పూరిళ్లు అగ్నికి అహుతయ్యాయి. స్థానికులు, అగ్నిమాపక ఎస్‌ఐ డి.హేమసుందర్ తెలిపిన వివరాల మేరకు.. కాకర ఎరకయ్య, సీతారాములు, లక్ష్మణ, అసిరియ్య పూరిళ్లు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాయి. స్థానికులు నీళ్లతో అర్పినా అప్పటికే సగం కాలిపోయాయి. అగ్నిమాపక వాహనం వచ్చి మిగతా మంటలు ఆర్పివేశారు. ఇంట్లో బీరువాలు, సామగ్రి, విలువైన పత్రాలు బుడిదయ్యాయని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా అగ్ని ప్రమాద బాధితులను వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు పిన్నింటి సాయికుమార్ పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. పక్కా ఇళ్లు మంజూరు చేయాలని తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్‌ను కోరారు. ఆయనతో పాటు జెడ్పీటీసీ టొంపల సీతారాం, నాయకులు మహంతి చిన రామునాయుడు, చిల్ల వెంకటరెడ్డి, సుంకరి కిషోర్ కుమార్, గొర్లె జగదీష్, మహంతి పెదరామినాయుడు, జోగ శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.


