శ్రీకాకుళం క్రైమ్: ల్యాబ్ లైసెన్సు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకొని మోసం చేసిన శ్రీనిధి డాక్టర్స్ ప్లాజా మేనేజర్ బొడ్డేపల్లి సుధీర్‌పై డాక్టర్సు ప్లాజా యజమానులు డాక్టర్ జన్ని రమ్య, డాక్టర్ నాగేంద్రబాబులు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం బొడ్డేపల్లి సుధీర్‌కు ల్యాబ్ లైసెన్సు కోసం మార్చి 6, 2024 ఫోన్ పే ద్వారా రూ.3.20 లక్షలు, నెల రోజుల వ్యవధిలో ఎక్యూప్‌మెంట్ కోసం మరో రూ.6 లక్షలు చెల్లించారు. అయితే ఇప్పటివరకు లైసెన్సు, పరికరాలు రాకపోవడంతో అతన్ని నిలదీసినా స్పందన లేకపోవడంతో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
విద్యుత్ షాక్‌తో గాయాలు
టెక్కలి: స్థానిక శ్రీనివాసానగర్‌లో ఒక విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కిషోర్ విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. విద్యుత్ సిబ్బంది పర్యవేక్షణలో మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో గాయపడిన యువకుడిని పట్టణంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన ఎలక్ట్రీషియన్‌కు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


