పలాస సామాజిక ఆస్పత్రి (సీహెచ్‌సీ)లో చిన్నపిల్లల వార్డులో ఫ్యాన్లు తిరగకపోవడంతో నవజాత శిశువులు, బాలింతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గర్భిణులు ప్రసవం అనంతరం ఇదే వార్డులోకి తల్లీబిడ్డలను ఉంచుతారు. అయితే ఈ వార్డులో కొన్ని ఫ్యాన్లు పని చేయకపోవడం, కొన్ని ఫ్యాన్ల నుంచి గాలి సరిగ్గా రాకపోవడంతో బాలింతలు అవస్థలు పడుతున్నారు.దీంతో కొందరు ఇంటి నుంచే ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆస్పత్రులను గాలికొదిలేశారని మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
–వజ్రపుకొత్తూరు రూరల్


