శ్రీకాకుళం: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్‌లో చిన్న మార్పు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ. రవిబాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మే 28వ తేదీన ప్రభుత్వం బక్రీద్ సెలవుగా ప్రకటించినందున ఆ రోజున జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్షను జూన్ 5వ తేదీకి వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ తెలియజేశారని ఆయన తెలిపారు. మే 28వ తేదీన జరగాల్సిన ఓపెన్ స్కూల్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ పరీక్షలు కూడా జూన్ 2కు మార్చినట్లు పేర్కొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష జూన్ 2 నుంచి జూన్7కు మార్చారని తెలిపారు.


