ప్రతిభావంతులకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ప్రతిభావంతులకు ప్రోత్సాహం

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సాధిస్తారని ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సురేష్‌ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడం ఆనందదాయకమన్నారు. ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్స్‌ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో చదువుతూ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు రూ.5వేలు, రూ.4వేలు, రూ.3వేలు చొప్పున నగదు బహుమతులు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడమే ఎస్‌ఆర్‌ సంస్థ లక్ష్యమన్నారు. అనంతరం తల్లిదండ్రులకు ప్రత్యేకంగా సన్మానించారు.కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ షాపింగ్‌మాల్స్‌ జోనల్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్‌, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement