నెలక్రితం పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

నెలక్రితం పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : దాదాపు నెలక్రితం పోగొట్టుకున్న బ్యాగును ట్రాఫిక్‌ పోలీసులు ఆధార్‌కార్డు సహాయంతో ట్రేస్‌ చేసి జిల్లాకేంద్రానికి చెందిన కొల్లేటి అమూల్యకు సోమవారం అప్పగించారు. అమూల్య సారవకోట మండలంలోని వెంకటాపురం పుట్టింటికి వెళ్లేందుకు ఆటోలో ఆర్టీసీ కాంప్లెక్సుకు బయల్దేరి బ్యాగును మరిచిపోయింది. ఆటోవాలా ఆ బ్యాగును సమీప ట్రాఫిక్‌ పాయింట్‌లో అప్పజెప్పడంతో కానిస్టేబుల్‌ అన్నెపు సత్యనారాయణ అందులో ఉన్న ఆధార్‌కార్డును చూసి సారవకోట పోలీసులకు సమాచారమివ్వడంతో చిరునామాను బట్టి అమూల్య బ్యాగుగా గుర్తించారు.

విద్యుత్‌ లైన్‌పై ఒరిగిన టవర్‌

రణస్థలం: పైడిభీమవరం జాతీయ రహదారి పక్కన ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ పాత టవర్‌ మంగళవారం 33 కేవీ హెచ్‌టీ విద్యుత్‌ లైన్‌పై వాలింది.ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడం, టవర్‌ కింద పడకుండా వైర్లపై నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు చర్యలు చేపట్టారు.

మెరుగైన వైద్యసేవలు

అందించాలి

పాతపట్నం: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ విజయలక్ష్మి ఆదేశించారు. పాతపట్నం సీహెచ్‌సీని మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, ఓపీ విభాగం, రోగుల వార్డులు, చిన్నపిల్లల వార్డు, బ్లడ్‌ బ్యాంక్‌ యూనిట్‌, రక్త పరీక్షల గదిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సక్రమంగా వైద్య సేవలు అందించి ఆస్పత్రికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డి.లీలాకుమార్‌, డాక్టర్లు జి.వేణుగోపాల్‌, జి.అనిత, హెచ్‌.సునీత, షణ్ముఖరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement