గుక్కెడు నీరు.. ఇచ్చేవారు లేరు | - | Sakshi
Sakshi News home page

గుక్కెడు నీరు.. ఇచ్చేవారు లేరు

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

బిందెడు నీటిని తెచ్చుకోవడానికి రెండు బిందెల చెమట్లు కార్చాల్సిన పరిస్థితి వస్తే..? ఆర్చుకుపోయిన గొంతును తడిపేందుకు కంట నీరు తప్ప నీటి చుక్క దొరక్కపోతే..? ఓ చేతిలో పసిబిడ్డ మరో చేతిలో బిందెతో కొండ దిగాల్సిన దుస్థితి వస్తే..? అంత దూరం నడిచాక ఖాళీ బావి వెక్కిరిస్తే..? పాలకుల దయ వల్ల స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా సిక్కోలు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. పాతపట్నం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంత వాసులకు వేసవి వస్తే భయం. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సిన దీన స్థితి వారిది. కొత్తూరు మండలంలోని చీపురుపల్లి, పెద్దరాజపురం, చిన్నరాజపురం, దాపాకులగూడ, జెన్నోడు గూడ, దొండమామిడి గూడ, అద్దాయి గూడ, పాండురమానుగూడ, కూడహ గూడ, గ్యాసరగూడ, అడ్డంగి అబలాసింగి వాసులకు ఈ కష్టాలు నిత్యకృత్యమయ్యాయి. గుప్పెడు రేషన్‌ తీసుకునేందుకు కొండంతా నడిపిస్తున్న సర్కారు.. గుక్కెడు నీటిని కూడా ఇవ్వలేక ఇలా వేధిస్తోంది.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, శ్రీకాకుళం

కొండలెక్కి దిగితేనే నీరు

Advertisement
 
Advertisement
Advertisement