● ఒడిశాలో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్
పర్లాకిమిడిలో పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు
పాతపట్నం సమీపంలోని వెలవెలబోతున్న పెట్రోల్ బంక్
ధర తక్కువే..
ఆంధ్రాలో కంటే ఒడిశాలోని పర్లాకిమిడిలో పె ట్రోల్ ధర తక్కువ. లీటర్ పెట్రోల్‌కు రూ.7 తక్కువగా ఉంటుంది. అందుకే పర్లాకిమిడి వెళ్లినప్పుడు పెట్రోల్ వేయిస్తాను.
– కొరాడ జగదీష్, వాహనదారుడు,
పాతపట్నం
పాతపట్నం: ఒడిశా సరిహద్దు ప్రాంత వాసులు పెట్రోల్, డీజిల్ కోసం పక్క రాష్ట్రానికి పరుగులు పెడుతున్నారు. కొత్తూరు, మెళియాపుట్టి, పాతపట్నం వాసులు పర్లాకిమిడి వెళ్లి పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రా కంటే ఒడిశాలో తక్కువ ధరకు వస్తుండడంతో అంతా అటే క్యూ కడుతున్నారు. తరచూ ఒడిశాకి వెళ్లలేని కొందరు వాహనదారులు పది లీటర్ల క్యాన్లలో పెట్రోల్, డీజిల్ తీసుకుని వచ్చి ఇంటి వద్ద నిల్వ ఉంచుకుంటున్నారు.


