‘ప్రజల ప్రగతికే రచన’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజల ప్రగతికే రచన’

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

శ్రీకాకుళం కల్చరల్‌: నిజమైన ప్రజాస్వామ్యం, సమానత్వం, శ్రామిక ప్రజల జీవితాల్లో అభివృద్ధి కోసం రచనలు సాగాలని పలువురు వక్తలు అన్నారు. నగరంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో రెండు రోజులుగా జరుగుతున్న జనసాహితీ 13వ మహాసభలు సోమవారంతో ముగిశాయి. జనసాహితీ అధ్యక్షులు కామ్రేడ్‌ దివి కుమార్‌ మాట్లాడుతూ కుల వివక్ష, లింగ వివక్ష ఇంకా సమాజం మీద దాడి చేస్తూనే ఉందని అన్నారు. జనసాహితి సహాయ కార్యదర్శి ఓవీవీఎస్‌ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సాహిత్య సభలో అఖిల భారత ప్రజా సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షులు గౌతమ్‌ ముఖర్జీ, అరసం నాయకులు చింతాడ కృష్ణారావు, విర సం అధ్యక్షులు అరసవల్లి కృష్ణ, సాహితీ స్రవంతి నాయకులు చీకటి దివాకర్‌, సీ్త్ర విముక్తి సంఘటన కార్యదర్శి కామ్రేడ్‌ లక్ష్మి, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ ప్రధాన కార్యదర్శి సురేష్‌ తమ సందేశాలను అందించారు.

‘పరిశ్రమల ఏర్పాటుకు భూములివ్వండి’

టెక్కలి: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రజ లు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు రావాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు సమీపంలో ఎంఎస్‌ఎంఈ పార్కు శంకు స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్‌పరం కాకుండా నిధులు కేటాయించామని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేరడి బ్యారేజీకు అడ్డంకులు తొలగాయని, రానున్న ఏడాదిన్నర లోగా బ్యారేజీను పూర్తి చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement