పట్టాలు ఇవ్వాలని గిరిజనుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

పట్టాలు ఇవ్వాలని గిరిజనుల ధర్నా

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

టెక్కలి: ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగ ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. సో మవారం టెక్కలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఎల్‌ఎన్‌ పేట మండలానికి చెందిన బెన్నాడిగూడ, కొత్తగూడ, గోలుకొప్ప గ్రామాల గిరిజన రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ గిరిజన రైతులు కొన్ని దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, కార్పొరేట్‌ కంపెనీలకు ఎకరా భూ మి 99 పైసలకే ఇవ్వడం కాదని, అర్హులైన గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గిరిజను లు సాగు చేస్తున్న భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గిరిజనులను కాదని ఇతరులకు అప్పగించాలని చూస్తే ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం పరిపాలనాధికారి రషీద్‌ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement