గార: మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో విజిలెన్సు, వ్యవసాయాధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. తూలుగు జంక్షన్‌లోని శ్రీశివపార్వతి ఎంటర్‌ప్రైజెస్, శ్రీ వేంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్ దుకాణాలను విజిలెన్సు ఎస్‌ఐ బి.రామారావు, ఏవో డి.పద్మావతిలు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వం ఇటీవల నిషేధించిన పారాక్వాట్ కలుపు మందు 287 లీటర్లు ఉండడంతో వాటి అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. తనిఖీల్లో ఏఈవోలు బి.దుర్గాప్రసాద్, జె.శ్రీదీప్తి తదితరులు పాల్గొన్నారు.


