టెక్కలి: జాతీయ రహదారి టెక్కలి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి భూలోకమాత వీధికి చెందిన రిషి, కార్తీక్ అనే ఇద్దరు యువకులు గాయపడ్డారు. జాతీయ రహదారిలో ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకులను శ్రీకాకుళం నుంచి పలాస వైపు వెళ్తున్న కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన యువకులను టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో కార్తీక్‌కు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి
వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండి – పలాస రైల్వేస్టేషన్ల మధ్య రైలు ప్రమాదంలో సోమవారం గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. సుమారు 50 నుంచి 55 ఏళ్లు వయస్సు ఉన్న మహిళ ఎగువకు వెళ్లే రైలుమార్గంలో మృతి చెందినట్లు తెలిపారు. శరీరం సన్నగా, జుట్టు తెలుపు రంగులో ఉన్నట్లు పేర్కొన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే 92475 85743 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.


