శ్రీకాకుళం: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల డిమాండ్ చేశారు. రెండు రోజులుగా శ్రీకాకుళంలో జరుగుతున్న జన సమితి రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు. 12వ పీఆర్‌సీని 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలని, 11వ పీఆర్‌సీ సంబంధిత బకాయిలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు మాట్లాడుతూ వెంటనే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలని, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షుడు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ కొప్పల భానుమూర్తి, పూర్వ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాయ సంపాదకుడు ఎస్వీ అనిల్ కుమార్, జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు పి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


