సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
రైతులకు మేలు చేసే భూములపై పెద్దల కన్ను పడింది. ఉద్దానం ఏరియాలోని ప్రధాన ప్రదర్శన క్షేత్రం భూములను కాజేసేందుకు వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి. ఆ భూములను ఏపీఐఐసీ ద్వారా సేకరించి, ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి, తద్వారా పరిశ్రమల పేరుతో కీలక నేత అనుయాయులకు కట్టబెట్టేందుకు పావులు కదులుతున్నా యి. దానికోసం జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నా రు. మూడు సార్లు వరుసగా గెలిపించిన ఇచ్ఛాపురం నియోజకవర్గ రైతులకు అన్యాయం చేస్తున్నారు.
ఉద్దానం కొబ్బరికి ఎసరు..
కవిటి మండలం రాష్ట్రంలో రెండో కోనసీమగా కొబ్బరిసాగులో గుర్తింపు పొందింది. జిల్లా తలసరి ఆదాయంలో ఉద్దానం కొబ్బరి ముఖ్యభూమిక పో షిస్తోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కొబ్బరిపంట సాగులో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కొబ్బరి రైతుకు ఆందోళన కలిగించేలా ఉన్నా యి. జిల్లాలో 35,000 హెక్టార్లలో సాగులో ఉండగా కవిటి పరిసర మండలాల్లోనే సుమారు 17,000 హెక్టార్ల వరకు సాగవుతోంది. కొబ్బరి, జీడి రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేయడం లేదు. మద్దతు ధర ఇచ్చేలా ప్రయత్నించడం లేదు. కానీ ఆ రైతులకు ఉప యోగపడే ఉద్యాన ప్రదర్శన క్షేత్రం భూములను మాత్రం బదలాయించేందుకు యత్నిస్తోంది.
చరిత్రను
కనుమరుగు చేసే యత్నం
ఉద్యానవన రైతులకు మేలైన రకాల మొక్కలు అందించాలనే లక్ష్యంతో 1994లో కవిటి మండలం శిలగాం సమీపంలో ప్రదర్శన క్షేత్రం(నర్సరీ)ని ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన క్షేత్ర భూములన్నీ ఉద్యానవన శాఖ కంట్రోల్‌లోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి కొబ్బరి, జీడి, మామిడి, పనస, జామ, సపోట మొక్కలను రైతులకు అందజేస్తూ వస్తోంది. వచ్చిన ఫలసా యాన్ని కూడా వేలం వేసి, ఉద్యానవన శాఖకు ఆదాయం తీసుకొచ్చేది. 20.95 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ ఉద్యాన క్షేత్రంలో 335 కొబ్బరిచెట్లు, 360 జీడిచెట్లు, 405 మామిడిచెట్లు, 30 పనసచెట్లు, 100 జామ చెట్లు, 12 సపోటా చెట్లు ఫలసాయం అందించే విధంగా ఉన్నాయి. తాజాగా ఈ ప్రదర్శనా క్షేత్రం భూములను ఏపీఐఐసీ ద్వారా భూమిని పారిశ్రామికీకరణకు బదలాయించేందుకు గుట్టు చప్పుడు కాకుండా శరవేగంగా పావులు కదులుతున్నాయి.
హామీకి భంగం–కొత్త ప్లాన్‌కు సిద్ధం
గతంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడే కోకోనట్ ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటుకు హామీ ఇచ్చిన విషయం విధితమే. కానీ ఆ వాగ్దానం అమలు చేయలేదు. కానీ, ఇప్పుడా భూములనే ఏకంగా బదలాయించేందుకు ప్రయత్నిస్తోంది. పరిశ్రమల విభాగానికి బదలాయించి తర్వాత దీన్ని గుంపగుత్తగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే దురాలోచన స్పష్టంగానే కనిపిస్తోంది. ఇదే ఉద్యాన క్షేత్రంలో భూగర్భ ఊటబావి కూడా ఉంది. భూగర్భ జలవనరుల శాఖ అధికారులు గతంలో చేయించిన ప్రాప్తికి రెండు చెట్ల విస్తారంగా భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించిన విష యం కూడా అప్పట్లో అధికారుల నివేదికలు సిద్ధం చేశారు. ఈ ప్రదేశాల్లో బోర్లు వేస్తే రోజుకు 2500 లీటర్ల నీరు అందించే వీలుందని అంచనాలు కూడా వేయడం జరిగింది. ఇంతటి ప్రాధాన్యత కల ఉద్యా న కొబ్బరి ప్రదర్శన క్షేత్రాన్ని రైతుల ప్రయోజనాలకు తిలోదకాలిచ్చి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రక్రియ ఇక్కడ రైతులకు ఆందోళన కలిగిస్తోంది.
ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేయదలిస్తే..
ప్రభుత్వం నియోజకవర్గానికొక ఎంఎస్‌ఎంఈ పా ర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తే ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట మండలాలతో పాటు కవిటి మండలంలోని కరాపాడు టోల్‌ప్లాజా సమీపంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాటిని సేకరించి, పారిశ్రామికీకరణ కోసం పార్క్‌లు ఏర్పాటు చేయవచ్చు. వాటిని వదిలేసి నియోజకవర్గ కీలక నేతకు చెందిన వ్యక్తుల కన్ను పడిందని శిలగాం ఉద్యానవన క్షేత్రం భూములను ఏపీఐఐసీకి అప్పగించి, వాటిలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి, తద్వా రా సదరు భూములను కావాల్సిన వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పూరితంగా అడుగులు వేస్తున్నా యి. ఈ 20.95 ఎకరాల స్థలాన్ని ఏపీఐఐసీకి బదలాయింపు ప్రక్రియ పూర్తిచేసి అప్పగించేస్తే దాన్ని 99 ఏళ్లకు ఎకరం రూ.రూపాయి వంతున లీజుకు అందించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనలు ఉన్నాయి.
ఉద్యానవన శాఖ భూములు.. ప్రైవేటు వ్యక్తుల పాలు
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అత్యంత శ్రేష్టమైన వ్యవసాయ యోగ్యమైన భూమిని కాజేయాలని చూడడం వెనుక కీలక నేత హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. ఇదిలా ఉండగా కవిటి మండలం రాజపురం సబ్‌స్టేషన్ వెనుక ఉన్న ప్రదేశంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఇచ్చిన డీపట్టా భూములపై కూడా కన్నేస్తే, అక్కడి రైతులు ఎదురుతిరిగారు. ఇప్పుడు ఆ భూములకు సమీపంలోని శిలగాం సమీపంలోని అత్యంత విలువైన ఉద్యాన క్షేత్రంపై దృష్టి పడడం సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. ఉద్యానవన శాఖ భూములు ప్రైవేటు వ్యక్తుల పాలవ్వడం తప్ప రైతులకు మేలు జరిగేది ఉండదనే వాదనలు ఉన్నాయి.
ఉద్దానం ఏరియాలోని ప్రధాన నర్సరీ భూములను ఏపీఐఐసీకి
కట్టబెట్టేందుకు యత్నం
ఎంఎస్‌ఎంఈ పార్క్ ద్వారా కావాల్సిన వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు పావులు
ఆ దిశగా చక్రం తిప్పుతున్న కీలక నేత
20,95 ఎకరాల క్షేత్రం కనుమరుగయ్యే ప్రమాదం


