విద్యార్థి మిత్రకు డీజిల్‌ మరక! | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి మిత్రకు డీజిల్‌ మరక!

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

బడులు తెరిచే నాటికి విద్యార్థులకు కిట్లు ఇవ్వలేమని ప్రకటన

విద్యా కానుకకు అంతర్జాతీయ పరిణామాలతో ముడిపెట్టిన ప్రభుత్వం

యుద్ధానికి ముడిపెట్టడం సరికాదు

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విషయంలో ప్రభు త్వం శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు అందజేస్తున్న విద్యా కాను క కిట్ల విషయంలో అంతర్జాతీ య పరిస్థితులకు ముడిపెట్టడం సరికాదు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచేనాటికి కచ్చితంగా పూర్తి స్థాయిలో విద్యా కానుక కిట్లు అందజేయాలి.

– టి.చందనరావు, స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి.

చంద్రబాబు ఎప్పుడూ నిర్లక్ష్యమే

ప్రభుత్వ పాఠశాలలు, అందులో చదువుతున్న పేద, సామాన్య వర్గాలకు చెందిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ నిర్లక్ష్యమే చూపుతుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయి. అప్పట్లో విద్యా కానుక కిట్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే పూర్తి స్థాయిలో కిట్లు అందజేయలేమని చెబుతున్నారు. – ఎం.గణపతిరావు,

విశ్రాంత ఉపాధ్యాయుడు, టెక్కలి.

ప్రభుత్వ పాఠశాలలంటే చులకన

ప్రభుత్వ పాఠశాలలంటే చంద్రబాబుకు చులకన. విద్యా కానుక కిట్లు పూర్తిగా ఇవ్వలేమని చెబు తూ, అంతర్జాతీయ పరిణామాలను ముడిపెడుతున్నారు. మంత్రులు, అధికార పార్టీ నాయకులకు మాత్రం ఇలాంటి ఆంక్షలు వర్తించవా. తక్షణమే పూర్తి స్థాయిలో విద్యా కానుక కిట్లు అందజేయాలి.

– పి.వైకుంఠరావు, వైఎస్సార్‌ టీఎఫ్‌

నియోజకవర్గ అధ్యక్షుడు, టెక్కలి

శ్రీకాకుళం, టెక్కలి: విద్యార్థి మిత్రకు సర్కారు డీజిల్‌ మరక అంటించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందజేస్తున్న ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’ కిట్‌ ఒక్కో విద్యార్థికి సుమారు రూ. 2,279 ఖరీదు చేస్తుంది. ఈ కిట్‌లో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, వర్క్‌బుక్స్‌, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, 3 జతల యూనిఫాం, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్ట్‌ వంటి ప్రాథమిక విద్యా సామగ్రిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. కుట్టుకూలి దీని కి అదనం. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ పద్ధతిని ప్రవేశపెట్టగా.. ప్రస్తుత ప్రభుత్వం పేరు మార్చి కొనసాగిస్తోంది. ఈ ఏడాది కూడా జూన్‌ 19వ తేదీన జరగబోవు మెగా పేరెంట్స్‌ టీచర్‌ మీటింగ్‌ కార్యక్రమంలో ఆర్భాటంగా విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ కూడా షెడ్యూల్‌ ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న ఆయిల్‌ కొరత కారణంగా ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి విద్యార్థి మిత్ర పంపిణీ మరింత ఆలస్యం అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

విద్యా శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు ఇది ఒక నెపం మాత్రమేనని వెండార్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల్లో తేడా వచ్చిందని, గత ఏడాదితో పోల్చుకుంటే సుమారు రెండు లక్షల 40 వేల మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలకు దూరమయ్యారని, విద్యార్థుల సంఖ్య ప్రోగ్రెసన్‌ రూపంలో ఇండెంట్‌ పెట్టడం, ప్రస్తుతం ఇండెంట్‌ కంటే రెండున్నర లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, మ్యానుఫ్యాక్చర్స్‌ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇండెంట్‌ ప్రాప్తికి హిట్ల తయారీ పూర్తయిందని, మొత్తం కిట్లు కొని తీరాల్సిందేనని పట్టు పట్టడంతో రూ.60 కోట్లకుపైగా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇదే అసలు కారణమని విద్యాశాఖలో పనిచేస్తున్న వారే లీకులిస్తున్నారు. గత ప్రభుత్వంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మే నెల మూడోవారా నికే మండల స్టాక్‌ పాయింట్లకు విద్యా కానుక కిట్లు పూర్తిస్థాయిలో చేరేవి. పాఠశాల పునః ప్రారంభం నాటికి పాఠశాల పాయింటుకు కిట్లు చేరవేసి విద్యారంగ పునర్నిర్మాణంపై నిబద్ధతను చాటుకుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థి మిత్రకు డీజిల్‌ మరకలు అంటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement