వాస్తవానికి ఈ ఉద్యాన క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడే నాణ్యమైన కొబ్బరి, అంటుమామిడి, జీడి, సపోట, పనస తదితర మొక్కలు తక్కువ ధరకు రైతులకు అందిచి రైతులకు ఎంతో మేలుచేసే వీలుంది. కొబ్బరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గానీ, రీసెర్చ్ సెంటర్ గానీ, కృషి విజ్ఞాన కేంద్రం గానీ ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. గతంలో ప్రతిపాదనలు, పరిశీలనలు కూడా జరిగాయి. రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ చివరగా ఉన్న ఈ ఏరియాలో ఉద్యాన పంటలకు సంబంధించి ఏ అవసరాలైనా సుదూరం వెళ్లి తీర్చుకోవాల్సి వస్తోంది. మొక్కల దగ్గరి నుంచి సలహాల వరకు ఎక్కడికో వెళ్లాల్సి వస్తోంది. ఆ అవసరాలన్నీ దగ్గరలో తీరేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సింది పోయి ఏకంగా ఆ భూములనే ఉద్యానవన శాఖ నుంచి లాక్కునేందుకు ప్రయత్నించడం విస్తు గొలుతోంది.


