సామాన్యులపై ‘పెట్రో’ పిడుగు | - | Sakshi
Sakshi News home page

సామాన్యులపై ‘పెట్రో’ పిడుగు

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

సామాన్యులపై ‘పెట్రో’ పిడుగు ● మళ్లీ మళ్లీ పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు ● అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం

ధరలు తగ్గించాలి

● మళ్లీ మళ్లీ పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు ● అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం

హిరమండలం: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజానీకం, రైతులు ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతుంటే.. తాజాగా కేంద్ర ప్రభుత్వం వరుసుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచుతూ అదనపు భారం మోపుతోంది. ఈనెల 15న లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.29 పైసలు, డీజిల్‌పై రూ.3.14 పైసలు పెంచేసింది. మళ్లీ ఈ నెల19న లీటరుకు 95 పైసలు చొప్పున పెంచేసింది. అక్కడితో ఆగకుండా మూడోసారి ఈ నెల 23న లీటర్‌ పెట్రోల్‌పై 87 పైసలు, డీజల్‌పై 91పైసాలు పెంచేసి సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచింది.

సరుకుల ధరలు ౖపైపెకి..

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధర అన్ని వర్గాలపైనా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా రవాణా ఖర్చులు పెరుగుతాయి. తద్వారా నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉంది. బియ్యం, పాలు, కూరగాయలు, నూనె తదితర ధరలు పెరిగితే సామాన్యులు మరింత ఇబ్బంది పడతారు. కాడెద్దులు కరువై రైతులు యంత్రాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ప్రతి యంత్రానికి పెట్రోల్‌, డీజిల్‌ ఉపయోగించాల్సిందే. దీంతో పంటల సాగులో రైతులపై ఆర్థిక భారం పడుతుంది. ప్యాసింజర్‌ ఆటో, జీపులు, కార్లు నడుపుతూ జీవనం సాగించే మధ్య తరగతి కుటుంబాలపైనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని పలువురు కోరుతున్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ మళ్లీ పెంచడం సరికాదు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడంతో అన్ని వర్గాల ప్రజలపైనా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు జీవనం కష్టతరమవుతోంది. పెంచిన ధరలు తగ్గించాలి.

– పి.పద్మావతి,

యంబరాం, ఎల్‌ఎన్‌పేట మండలం

Advertisement
 
Advertisement
Advertisement