శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ముని శ్రీనివాసరావు(శ్రీకాకుళం), ప్రధాన కార్యదర్శిగా వేదుల సంతోష్‌కుమార్ (ఇచ్ఛాపురం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ విస్తృతస్థాయి సమావేశంతోపాటు నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఫుట్‌బాల్ అసోసియేషన్, శాప్ ప్రతినిధులు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధుల సమక్షంలో అడ్వకేట్ సూరు గోవిందరాజులు (గోపి) ఎన్నికల అధికారిగా వ్యవహరించి.. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేశారు. కార్యక్రమంలో ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు జి.పవన్‌కుమార్, శేషగిరిరావు, నాని, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, జిల్లా నలుమూలల నుంచి ఫుట్‌బాల్ క్లబ్‌ల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లాలో ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని, పాఠశాలల్లో ఫుట్‌బాల్ క్రీడను పీడీ, పీఈటీల సహాయంతో మరింత విస్తృతం చేద్దామని నూతన కార్యవర్గం ప్రతినిధులు స్పష్టం చేశారు.
నూతన కార్యవర్గమిదే..
జిల్లా అధ్యక్షుడిగా ముని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా డి.దివాకర్‌రావు (సుప్రీమ్), వి.సుగుణ్‌కుమార్, వై.ఎన్.పి.లత, ప్రధాన కార్యదర్శిగా వేదుల సంతోష్‌కుమార్, కోశాధికారిగా కె.నవీన్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా దుంగ శ్రీధర్, కె.కోటేశ్వరరావు, ఎ.వెంకటరావు, సీహెచ్ వీరభద్రరావు, ఎం.వి.ఎస్.సాయిసూర్య, ఎ.రేవతిలను ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో కె.నివాస్‌కుమార్, జె.నాగరత్నం, ఎ.జ్యోత్స్న, కె.భాస్కర్, మోహన్‌రావులు, జాయింట్ సెక్రటరీగా జి.రాందేవ్ గాంధీ, మాడుగుల రామారావు, తంగి మురళీమోహనరావు, నాయుడులు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తంగి రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు,


