శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యార్థులు నచ్చిన గేమ్‌ను ప్యాషన్‌గా తీసుకోవాలని, అదే క్రీడను కెరీర్‌గా ఎంచుకోవాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా క్రికెట్ సంఘం(జెడ్‌సీఎస్) ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఆర్‌ఐఓ కార్యాలయానికి సమీపంలో అత్యాధునిక హంగులతో రూ.17లక్షల నిధులతో ఏర్పాటుచేసిన ఫ్లడ్‌లైట్లతో కూడిన క్రికెట్ నెట్స్‌ను ఆదివారం జెడ్‌సీఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడాకారులు చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని, రెగ్యులర్‌గా ప్రాక్టీసు చేయాలని సూచించారు. టోర్నీలు, మ్యాచ్‌లు ఆడుకునేందుకు అవకాశం కల్పించాలన్న జిల్లా క్రికెట్ సంఘం విజ్ఞప్తి మేరకు ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్‌లో వసతులుతో తీర్చిదిద్దిన మైదానాన్ని ఉచితంగా వాడుకోవచ్చని హామీ ఇచ్చారు. ఉజ్వలమైన భవిష్యత్తును అందిపుచ్చుకోవాలని సూచించారు. రవికుమార్ మాట్లాడుతు ప్రతిభ కలిగిన క్రీడాకారులకు న్యాయం చేస్తు వారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు. జిల్లాలో మూడేళ్లలో జెడ్‌సీఎస్ సాధించిన ప్రగతి, క్రీడాకారుల విజయాలను మెంటార్ ఇలియాస్ మహ్మద్ వెల్లడించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.పోలినాయుడు, జిల్లా కార్యదర్శి హసన్‌రాజా షేక్, ఉపాధ్యక్షుడు టి.బాలమురళీకృష్ణ, కోశాధికారి మదినా శైలానీ, కౌన్సిలర్ డాక్టర్ ఎస్.రవికుమార్, సంయుక్త కార్యదర్శి ఎన్‌జీ బెనర్జి, సుంకరి కృష్ణకుమార్, కోచ్‌లు కె.సుదర్శన్, ఎ.ఆనంద్, మహిళా కోచ్‌లు హారికాప్రసాద్, రమణమ్మ, రవికిరణ్, క్రీడాకారుల తల్లిదండ్రులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.


