పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక | - | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్‌.పురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2004–05 బ్యాచ్‌ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం నిర్వహించారు. ముందుగా ఆనాటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాక పూర్వ ఉపాధ్యాయులను, స్మేహితులను మరువకుండా ఆత్మీయ కలయిక నిర్వహించడం గొప్ప విషయమన్నారు. విద్యార్థి దశలో ఏర్పడిన స్నేహం చిరకాలం కొనసాగుతుందన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement