కొబ్బరి ధరహాసం | - | Sakshi
Sakshi News home page

కొబ్బరి ధరహాసం

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

కొబ్బరి ధరహాసం ●దిగుబడిపై రైతులు దృష్టి పెట్టాలి..

అధిక ఉష్ణోగ్రతలతో తగ్గిన కొబ్బరి దిగుబడి భారీగా పెరిగిన బొండాం ధరలు

పట్టణాల్లో లీటరు కొబ్బరి నీరు రూ.170 పైనే

ఉష్ణోగ్రతల్లో విపరీతమైన మార్పులు.. పడిపోయిన దిగుబడులు.. ఉద్దానాన్ని వీడని చీడ పీడలు.. కలగలిపి కొబ్బరి నీళ్ల ధరలను విపరీతంగా పెంచాయి. శరీరానికి చలువ చేసే బొండాల ధర రోజురోజుకీ పెరుగుతుండడంతో సామాన్యులు తట్టుకోలేకపోతున్నారు. పట్టణాల్లోనైతే లీటర్‌ కొబ్బరి నీళ్ల రూ.170పైనే పలుకుతోంది.

కంచిలి, హిరమండలం: ఎండలు మండే కొద్దీ కొబ్బరి బొండాల ధరలు ఎగబాకుతున్నాయి. ఉత్పత్తి తగ్గి గిరాకీ పెరగడంతో ధర పెరుగుతోంది. జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో అధికంగా కొబ్బరి ఉత్పత్తి అయ్యేవి. ఇప్పుడు రకరకాల చీడపీడలు ఆశించడంతో భారీగా దిగుబడులు పడి పోయాయి. దీంతో కొబ్బరి బొండాలు సైతం బయట ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితి ఏర్పడింది. దీంతో ధరలు ఎగబాగుతున్నాయి. ఈ నెలలో కొబ్బరి బొండాల వినియో గం రెట్టింపైంది. జిల్లాలో 36వేల హెక్టార్లలో కొ బ్బరి పంట సాగువుతున్నప్పటికీ తగిన దిగుబ డులు లేవు. దీంతో ఇక్కడ ఉత్పత్తి అయ్యే కొబ్బ రితోపాటు విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లా ల నుంచి సైతం దిగుమతి చేసుకుంటున్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 40 నుంచి 45కి పెరగడంతో కొబ్బరి బొండాల వినియోగం రెట్టింపైంది. రైతుల నుంచి కొబ్బరి బొండాలను దళారులు తక్కువ ధరలకే కొనుగోలు చేసి రిటైల్‌ వ్యాపారులకు రూ.30 నుంచి రూ.35కు అమ్మకా లు చేపడుతుండటంతో, కాయ సైజును బట్టి రూ.40 నుంచి రూ.50 వరకు రిటైల్‌ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇక పట్టణాల్లో అయితే కొబ్బరి నీరు బాటిల్‌లో నింపి అరలీటరు, లీటరు చొప్పు న అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఒక లీటరు కొబ్బరి నీరు రూ.170 వరకు గరిష్టంగా అమ్ముతున్నారు.

ఉత్పత్తులు తగ్గడం కూడా..

ఏప్రిల్‌, మే నెలలో రావాల్సిన బొండాల దిగుబడి ఇప్పుడు రావడం లేదు. తెల్లదోమ తాకిడి పెరగడం, ఉష్ణోగ్రతల్లో మార్పులు వెరసి ఉత్పత్తి తగ్గిపోయింది. కొబ్బరి బొండాలకు ధర పెరిగినా సేకరణ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బ యట ప్రాంతాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నామని వ్యాపారులు అంటున్నారు.

కొబ్బరి బొండాల దిగుబడిపై రైతులు దృష్టి పెట్టాలి. సంప్రదాయ సాగు విధానంలో బొండాం తీస్తే చెట్టు దెబ్బతింటుందనే అపోహ రైతుల్లో ఇంకా ఉంది. కొబ్బరి మొక్క సాగుకు అయ్యే ఖర్చుకు తగిన ఆదాయం లేదు.

– ఆళ్ల రామభూపతిరెడ్డి, రైతు, చిల్లపేట రాజాం

Advertisement
 
Advertisement
Advertisement