ప్రతి ఓటూ కీలకమే | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఓటూ కీలకమే

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

ప్రతి ఓటూ కీలకమే ● బూత్‌ ఏజెంట్లకు వైఎస్సార్‌ సీపీ నేతల దిశా నిర్దేశం

నరసన్నపేట: ఎన్నికల కమిషన్‌ అధికారికంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం అత్యంత కీలకమని, ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మన ఓట్లు పోయే ప్రమాదం ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ, ఎస్‌ఐఆర్‌ జిల్లా పరిశీలకుడు కుంభా రవిబాబు, రాష్ట్ర పరిశీలకులు హర్షవర్దనరెడ్డి అన్నారు. స్థానిక మేఘనా కన్వెన్షన్‌లో శనివారం నరసన్నపేట నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ బూత్‌ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని కుంభా రవిబాబు అన్నారు. బూత్‌ ఏజెంట్లే ముఖ్యమని హర్షవర్దన్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 2358 పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ లెవెల్‌ ఏజెంట్లును నియమించుకున్నామని ధర్మాన కృష్ణదాస్‌ తెలిపా రు. మంచి ఫలితాలు సాధించాలంటే ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాలని తమ్మినేని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement