ఈదురు గాలుల ధాటికి శ్రీకాకుళం డివిజన్‌లోనే అధిక నష్టం వాటిల్లింది. పొందూరు, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లో సుమారు రూ.25 లక్షల వరకు నష్టం వాటిల్లింది. 26 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, 4 చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 14 చోట్ల వైర్లు తెగిపడ్డాయి. కింతలి, నెలివాడ, మెట్టపేట, పొన్నాడల వద్ద పిడుగులు పడటంతో 33 కేవీ ఇన్సులేటర్లు పేలిపోయాయి. దీంతో రణస్థలం, ఎచ్చెర్ల, పొందూరు మండలాల్లో బ్రేక్‌డౌన్ డిక్లేర్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు విద్యుత్ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపడుతున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో పరిస్థితి పూర్వ స్థితికి రాలేదు. విద్యుత్ సర్కిల్ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, టెక్నికల్ ఈఈ సురేష్‌కుమార్, ఆపరేషన్స్ శ్రీకాకుళం ఈఈ పైడి యోగేశ్వరరావు, పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు.


